బీసీసీఐ కీలక నిర్ణయం, నలుగురు సభ్యుల సెలక్షన్‌ కమిటీకి ఉద్వాసన

BCCI Dissolves 4-member National Selection Committee Invites Applications for Position of National Selectors,Bcci Key Decision, Dismissal Of Selection Committee,Four-Member Selection Committee,Mango News,Mango News Telugu,T20 World Cup Fallout,Bcci Sacks Entire Selection Panel, Split Captaincy In Job,Bcci Sacks 4-Member Selection,Bcci Sacks Senior Men,Bcci Selection Committee,Chetan Sharma-Led Selection Panel,Bcci,Board Of Control For Cricket,Bcci Selection Committee Sacked,Bcci Headquarters,The Board Of Control For Cricket In India

భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. చేతన్‌ శర్మ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన సెలక్షన్‌ కమిటీకి మొత్తానికి ఒకేసారి ఉద్వాసన పలికింది. టీ20 ప్రపంచకప్‌-2022లో భారత్ జట్టు పేలవ ప్రదర్శనతో సెమీఫైనల్ లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ ముగిసిన వారం రోజులకే ఆ జట్టును ఎంపిక చేసిన సెలక్షన్‌ కమిటీపై వేటు వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతో పాటుగా సెలక్షన్ కమిటీలో మిగతా సభ్యులైన సునీల్ జోషి, హర్విందర్ సింగ్ మరియు దేబాశిష్ మొహంతిపై వేటు పడింది.

మరోవైపు వారి స్థానాలను భర్తీచేసేందుకు వెంటనే జాతీయ సెలక్టర్స్ (సీనియర్ మెన్) పోస్టుల భర్తీకి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది, అర్హులైన వారంతా తమ దరఖాస్తులను 2022, నవంబర్ 28న సాయంత్రం 6 గంటల లోపు సమర్పించాలని బీసీసీఐ సూచించింది.

జాతీయ సెలక్టర్స్ పదవీ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికీ ఉండాల్సిన అర్హతలు: (పదవులు-5)

  • కనీసం 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి లేదా
  • 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి లేదా
  • 10 వన్డే మరియు 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి
  • కనీసం 5 సంవత్సరాల క్రితం ఆట నుండి రిటైర్ అయి ఉండాలి
  • అలాగే మొత్తం 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో (బీసీసీఐ యొక్క నియమాలు మరియు నిబంధనలలో నిర్వచించబడినట్లుగా) సభ్యుడిగా ఉన్న ఏ వ్యక్తి కూడా పురుషుల ఎంపిక కమిటీలో సభ్యునిగా ఉండటానికి అర్హులు కాదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 13 =