జనాభా సంక్షోభ భయంతో దక్షిణ కొరియా కీలక నిర్ణయం

South Korea Takes Key Decision Amid Birth Rate Falls in The Country,South Korea Takes Key Decision,Amid Birth Rate Falls in The Country,South Korea Key Decision,Mango News,Mango News Telugu,South Korea, population crisis, A pilot project, hire foreign helpers, children,Seoul is the capital,South Korea Latest News,South Korea Latest Updates,South Korea Live News,South Korea Live Updates

చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో యువశక్తి నానాటికీ తగ్గిపోతోంది. ఆ దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ఆర్థికంగా శ్రామిక శక్తి తగ్గడమేకాక వారిపై వయోవృద్ధుల భారం పడటం ఆయా దేశాలకు కష్టతరంగా మారాయి. వీటితోపాటు ఇతర ఒత్తిళ్లతో యువత పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడంపై అస్సలు ఆసక్తి చూపించడం లేదు.

జనాభాలో ఈ ప్రతికూల మార్పుతో తయారీ, వ్యవసాయ రంగాల్లో కార్మిక కొరత ఏర్పడుతోంది. ఇది అనేక ఇతర పరోక్ష సమస్యలకు కారణమవుతోంది. కార్మిక శక్తి తక్కువ ఉండటం వల్ల దక్షిణకొరియా ఓసారి పనిగంటలు వారానికి 52 గంటల నుంచి 69 గంటలకు పెంచింది. కానీ, తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ వెనక్కి తగ్గింది.

ఈ జనాభా సంక్షోభ సమస్య ముదరకుండా దక్షిణ కొరియా కీలక నిర్ణయం తీసుకుంది. యువతపై ఒత్తిడి తగ్గించాలనే లక్ష్యంతో ఓ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. పిల్లల సంరక్షణ, ఇంటి పనుల ఒత్తిడి తంగ్గించడానికి విదేశీ సహాయకులను నియమించుకోవడానికి అనుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే దేశ రాజధాని సియోల్‌లోని ఇళ్లల్లో పని చేయడానికి తొలుత 100 మంది విదేశీ సహాయకులను అనుమతించింది. డిసెంబర్ నాటికి ఇది మొదలు కానుంది. దశలవారీగా దీన్ని పరిశ్రమలు, సంస్థలకూ విస్తరించాలనే యోచనలో ఉంది.

దక్షిణ కొరియా ప్రభుత్వం ఇటీవలే 19 నుంచి 34 ఏళ్లలోపు వారిపై నిర్వహించిన ఓ సర్వేలో సగానికిపైగా.. వివాహం తర్వాత పిల్లలను కనాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. వివాహం పట్ల సానుకూల దృక్పథం ఉందని కేవలం 36.4 శాతం మంది మాత్రమే తెలిపినట్టు ఆ సర్వే పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 17 =