బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: విజయం దిశగా ఎన్డీఏ కూటమి

Bihar Assembly Election Results 2020 Live Updates, Bihar Assembly Elections 2020 Results, Bihar Assembly Elections 2020 Results LIVE, Bihar Assembly Elections 2020 Results LIVE Updates, Bihar Assembly Elections Results, Bihar Assembly Elections Results 2020, Bihar election result, Bihar election result LIVE, Bihar Election Results LIVE Updates

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (బీజేపీ+జనతాదళ్ యునైటెడ్+వీఐపీ+హెఛ్ఏఎంఎస్), కూటమి విజయం దిశగా సాగుతుంది. బీహార్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు 122 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, ఎన్డీఏ కూటమి 125 (గెలుపు+ఆధిక్యం) స్థానాల్లో ఆధిపత్యంలో ఉంది. దీంతో ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశం ఉంది. మరోవైపు మహాగట్‌బంధన్ (కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు) ప్రస్తుతానికి 111 (గెలుపు+ఆధిక్యం) స్థానాల్లో ముందంజలో ఉంది. కాగా ఎల్జేపీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోతుంది. ఎన్డీఏ నుంచి సీఎం అభ్యర్థి నితీష్ కుమార్, మహాగట్‌బంధన్‌ నుంచి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అధినేత తేజస్వి ప్రసాద్ యాదవ్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి నుంచి అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే నేపథ్యంలో సీఎం అభ్యర్థిపై మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: (గెలుపు+ఆధిక్యం):

ఎన్డీఏ కూటమి:

  • బీజేపీ: 74
  • జేడీయూ: 42
  • వీఐపీ: 4
  • హెఛ్ఏఎంఎస్ : 4

మహాగట్‌బంధన్:

  • ఆర్జేడీ: 76
  • కాంగ్రెస్: 19
  • వామపక్షాలు: 16
    ————
  • ఎల్జేపీ: 1
  • ఇతరులు: 7

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 1 =