ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక

MLA Quota MLC Elections in Telangana: Three BRS Candidates Elected Unanimously,MLA Quota MLC Elections in Telangana,Three BRS Candidates Elected Unanimously,MLC Elections in Telangana,Mango News,Mango News Telugu,BRS Candidates Win MLA Quota MLCs Elections,MLA Quota MLC Polls,Three BRS Candidates Elected Unopposed,MLC Elections,Telangan MLC Polls,Telangana MLC Elections 2023,Telangana MLC Elections Latest Updates,Telangana MLC Elections Latest News,BRS Party,BRS Party MLC Elections News Today

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అభ్య‌ర్థులు దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ముందుగా ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులగా దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు ఈ ముగ్గురితో పాటుగా మరో స్వతంత్ర అభ్య‌ర్థి నామి‌నే‌ష‌న్లు దాఖలు చేశారు. అయితే పరిశీలన అనంతరం స్వతంత్ర అభ్యర్థి పాలమూరి కమల నామి‌నే‌ష‌న్ ను ఎన్ని‌కల రిట‌ర్నింగ్‌ అధి‌కారి తిర‌స్క‌రిం‌చారు.

కాగా గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. దీంతో ఎలాంటి పోటీ లేకపోవడం, బరిలో ఈ ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే ఉండడంతో, వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైనా దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =