హైదరాబాద్‌లో జూలైలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. ఆ 3 రోజులూ నగరంలోనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా?

Prime Minister And Union Home Minister will Stay in Hyderabad For 2 Days To Attend National Executive Meeting of BJP From July 2, PM Modi and Amit Shah will Stay in Hyderabad For 2 Days To Attend National Executive Meeting of BJP From July 2, Amit Shah will Stay in Hyderabad For 2 Days To Attend National Executive Meeting of BJP From July 2, PM Modi will Stay in Hyderabad For 2 Days To Attend National Executive Meeting of BJP From July 2, PM Modi and Amit Shah will Stay in Hyderabad For 2 Days, National Executive Meeting of BJP From July 2, National Executive Meeting of BJP, BJP National Executive Meeting From July 2, BJP National Executive Meeting, BJP National Executive Meeting News, BJP National Executive Meeting Latest News, BJP National Executive Meeting Latest Updates, BJP National Executive Meeting Live Updates, Union Home Minister Amit Shah, Union Home Minister, Home Minister Amit Shah, Minister Amit Shah, Amit Shah,PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెల జూలై 2 నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అగ్రనేతలందరూ హాజరుకానున్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్‌లో ఆ పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలోనే బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ మాజీ చీఫ్ కె లక్ష్మణ్‌ను కూడా ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు పంపింది. అయితే ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ రానున్న బీజేపీ అగ్ర నేతలు, ప్రధాని మోదీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇరువురూ నగరంలోనే బస చేయనున్నారని సమాచారం. ఆ రెండు, మూడు రోజులూ హైదరాబాద్‌లోనే ఉండనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పార్టీకి చెందిన సుమారు 300 మంది ప్రముఖులు హాజరవ్వొచ్చని, వీరందరికీ నోవాటెల్ హోటల్ వద్ద విడిది ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో నగరంలో భద్రతను భారీగా పెంచనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =