సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీని ఆహ్వానించిన చినజీయర్‌ స్వామి

chinna jeeyar swami, Chinna Jeeyar Swami Invites PM Modi, Chinna Jeeyar Swamy, Chinna Jeeyar Swamy Invited PM Modi, Chinna Jeeyar Swamy Invited PM Modi Today for Inaugural Event, Chinna Jeeyar Swamy Invited PM Modi Today for Inaugural Event of the Statue of Equality, Inaugural Event of the Statue of Equality, Inauguration ceremony of Statue of Equality, Mango News, pm narendra modi, Statue of Equality

శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని శనివారం నాడు త్రిదండి చినజీయర్‌ స్వామి ఆహ్వానించారు. ఫిబ్రవరి 2, 2022 నుంచి ఫిబ్రవరి 14, 2022 వరకు నిర్వహించే భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 216 అడుగుల ఎత్తయిన రామానుజుల పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీకి చినజీయర్‌ స్వామి ఆహ్వాన పత్రిక అందించారు. ప్రధానిని కలిసినవారిలో చినజీయర్‌ స్వామీజీతో పాటుగా, మై హోమ్ గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు. ఈ సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు తప్పక వస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ఈ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా వరుసగా దేశంలోని పలువురు ప్రముఖులను చినజీయర్‌ స్వామి స్వయంగా అహ్వానిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఆహ్వానం అందించారు. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ లకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here