ఇప్పటి వరకూ ఎన్ని దేశాలు తుపాన్లకు నామకరణం చేశాయి?

Do They Give Those Names to Storms,Do They Give Those Names,Those Names to Storms,names to storms, Typhoons,India, Pakistan, Myanmar, Sri Lanka, Thailand, Bangladesh, Maldives, Oman,Mango News,Mango News Telugu,Names to Storms Latest News,Names to Storms Latest Updates,Names to Storms Live News,Typhoons Latest News,Typhoons Latest Updates,Storms and Hurricanes Latest News
names to storms, typhoons,India, Pakistan, Myanmar, Sri Lanka, Thailand, Bangladesh, Maldives, Oman,

ప్రస్తుతం మిచౌంగ్ తుపాన్ చెన్నైతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను వణికిస్తోంది. ముఖ్యంగా  తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే కుండపోత వర్షాలతో జనాలు అల్లాడుతున్నారు.  దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలా తుపాన్లు వచ్చిన చాలాసార్లు ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం కూడా సంభవిస్తూ ఉంటుంది. అయితే తుపాన్లు వచ్చిన ప్రతీసారి  తిత్లీ, హుద్ హుద్, అంఫన్, మాండూస్, యాస్  అంటూ పేర్లతో పిలవడం వింటూ ఉంటాం.   అటువంటప్పుడే తుపాన్లకు ఈ పేర్లు ఎవరు పెడతారు, దేని ఆధారంగా  పెడతారని చాలా మందిలో అనుమానం వస్తుంటుంది.

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు పని చేస్తున్నాయి. అలాగే ఈ ఆరు ప్రపంచ వ్యాప్త వాతావరణ కేంద్రాలతో పాటు  ఐదు ప్రాంతీయ ఉష్ణ మండల తుపాను హెచ్చరికల కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ కేంద్రాలన్నీ తుపాన్ల గురించి హెచ్చరికలు, సూచనలు చేస్తుంటాయన్న  విషయం తెలిసిందే. ఆసమయంలోనే తుపాన్లకు పేర్లను కూడా ఈ కేంద్రాలే పెడుతుంటాయి.

నిజానికి తుపాన్లకు ఇలా పేర్లు పెట్టే సంప్రదాయంను 2000 సంవత్సరంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్ కమిషన్‌ ఫర్‌ ఏసియా అండ్‌ పసిఫిక్‌, వరల్డ్‌ మెట్రలాజికల్‌ ఆర్గనైజేషన్‌ కలిసి ప్రారంభించాయి. అప్పటి నుంచే తపాన్లకు వివిద పేర్లు పెట్టి పిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భారత్‌, పాకిస్థాన్‌, మయన్మార్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, ఒమన్‌ దేశాలున్నాయి. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రాలలో ఏర్పడే  తుపాన్లకు ఈ దేశాల వాతావరణ కేంద్రాలు  పేర్లను పెడుతుంటాయి.

భారత దేశంలో అయితే ఢిల్లీలోని వాతావరణ కేంద్రం.. కొన్ని తుపాన్ల పేర్లను ముందుగానే నిర్ణయించి ఉంచుతుందట. రానున్న తుపానుకు ఒక పేరు సూచించాలని మిగిలిన దేశాలను కోరుతుంది. ముఖ్యంగా అరేబియా సముద్రం, బంగాళాఖాతం తీరంలో ఉన్న సభ్య దేశాలకు ఈ పేర్ల లిస్టును పంపుతుంది. అయితే ఇలా తుపాన్లకు పేరు పెట్టే సంస్కృతిని అమెరికానే తీసుకువచ్చిందట.

2018 లో ఈ ప్యానెల్లో కొత్తగా ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, యెమెన్ చేరాయి. మొత్తం 64 పేర్లను ఇప్పటి వరకూ ఈ ఎనిమిది దేశాలు ఎంపిక  చేయగా.. ఇప్పటికే 57 పేర్లను వివిధ దేశాల తుపాన్లకు నామకరణం చేసేశారు. అలా భారత్ తుపానులకు సూచించిన పేర్లలో అగ్ని, జలి, బిజిలి, ఆకాష్ ఉండగా.. మలా అనే పేరును శ్రీలంక సూచించిన పేరును కూడా తుపానుకు గతంలో పెట్టారు. అలాగే హెలెన్ అనే పేరును బంగ్లాదేశ్ పెట్టగా, నీలోఫర్‌ అనే పేరును పాకిస్తాన్ నామకరణం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + five =