ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాంగ్రెస్

Congress Central Election Authority Issues Notification For AICC President Polls Today, Congress released notification for AICC president election, AICC president election, AICC president notification, Congress AICC president election, AICC president election notification, Rahul Gandhi , Aicc President, TPCC's Key Decision, TPCC Resolution on Aicc President, Aicc President Rahul Gandhi, Rahul Gandhi Aicc President, Mango News, Mango News Telugu, TPCC Congress President, TPCC Decision on Aicc President, All India Congress Committee , Indian National Congress, Sonia Gandhi

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తొలి అడుగు వేసింది. పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల అథారిటీ గురువారం ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ దీనిపై ప్రకటన చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగంలోని ఆర్టికల్ XVIII ప్రకారం ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారం భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు పిలుపునిస్తున్నానని ఈ సందర్భంగా మిస్త్రీ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సోనియా గాంధీ పార్టీ తాత్కాలిక అధక్షురాలిగా ఉన్నారు. అయితే ఆమె తదనంతరం పార్టీ వారసుడిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది.

నోటిఫికేషన్‌లో జారీ చేసిన వివరాల ప్రకారం.. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సెప్టెంబర్ 24 నుండి 30 వరకు జరుగుతుంది. అనంతరం అక్టోబరు 1 వరకు నామినేషన్ పత్రాల పరిశీలన జరుగనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబరు 8 అని పేర్కొన్నారు. ఇక ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక అక్టోబర్ 17న జరుగనుంది. అలాగే అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. కాగా నామినేషన్ ఫారం ఏఐసీసీ కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. ఒకవేళ ఈ నామినేషన్ల ప్రక్రియలో ఒకరి కన్నా ఎక్కువమంది నామినేషన్ దాఖలు చేయకపోతే అప్పుడు ఎన్నిక ఏకగ్రీవమవనుంది.

ఇక ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాను ఎన్నికల బరిలోకి దిగవచ్చని స్పష్టమైన సూచన ఇవ్వడం మరియు నామినేషన్ ఫార్మాలిటీల గురించి ఆరా తీయడానికి శశి థరూర్ పార్టీ పోల్ ప్యానెల్ చీఫ్‌ని కలవడం వంటి కారణాలతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ వేడెక్కింది. మరో విశేషమేమంటే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధినేత పదవికి పోటీ జరుగనుండటం. పార్టీ చివరిసారిగా నవంబర్ 2000లో ఈ పదవికి పోటీని నిర్వహించింది. అప్పుడు జితేంద్ర ప్రసాదపై సోనియా గాంధీ ఘనవిజయం సాధించారు. రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన 2017 మరియు 2019 మధ్య రెండేళ్లు మినహా 1998 నుండి పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఎక్కువ కాలం పదవిలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉండాలంటూ పలు రాష్ట్రాల పీసీసీలు ఇప్పటికే తీర్మానాలు ఆమోదించి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here