కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శ్రేణులనుద్దేశించి కీలక ప్రసంగం

Congress Leader Rahul Gandhi Kick-Start Congress Poll Campaign in Belagavi Karnataka Today,Congress Leader Rahul Gandhi,Congress Leader Rahul Gandhi Congress Poll Campaign, Rahul Gandhi Congress Poll Campaign,Mango News,Mango News Telugu, Congress Poll Campaign in Belagavi, Indian National Congress,national Politics, Bengaluru Elections, Belagavi Elections, Rahul Gandhi , Rahul Gandhi Latest News and Updates

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం కర్ణాటకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన బెలగావిలో జరిగిన యువక్రాంతి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సీపీఈడీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కర్ణాటక యువతకు ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా తదితరులు పాల్గొన్నారు. జరగనున్న ర్యాలీ ఏర్పాట్లను సుర్జేవాలా సమీక్షించారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత అవినీతిమయమైనది కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వమని, ఇది 40 శాతం కమీషన్ ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వలే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం సాధారణ ప్రజలకు చేసిందేమీ లేదని, అదే సమయంలో తమకు సన్నిహితులుగా ఉన్న వ్యక్తులకు మరియు ఎంపిక చేసిన వారికి అత్యధిక ప్రయోజనాలు కల్పిస్తోందని విమర్శించారు. త్వరలోనే ప్రజా ప్రభుత్వం అధికారం చేపడుతుందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా బడుగు, బలహీన, చిన్న వ్యాపారుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here