కేబీఆర్ పార్కులో వరల్డ్ స్పారో డే దినోత్సవ వేడుకలు, పాల్గొన్న పీసీసీఎఫ్ డోబ్రియాల్, పక్షుల ప్రేమికులు, విద్యార్థులు

World Sparrow Day Celebrations held at KBR Park Telangana PCCF RM Dobriyal Attends,World Sparrow Day Celebrations held at KBR Park,Telangana PCCF RM Dobriyal Attends Celebrations,World Sparrow Day at KBR Park,Mango News,Mango News Telugu,Telangana PCCF RM Dobriyal,Telangana World Sparrow Day Latest News,Telangana World Sparrow Day Latest Updates,Telangana News,Telangana PCCF RM Dobriyal Latest Updates,Telangana World Sparrow Day Celebrations Live News

పక్షులు, ముఖ్యంగా పిచ్చుకలు మన జీవన విధానంలో భాగంగా కొనసాగాయని, అవి అంతరించి పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ అన్నారు. కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం (కేబీఆర్ పార్క్)లో సోమవారం జరిగిన ప్రపంచ పిచ్చుకల దినోత్సవ (మార్చి 20) వేడుకల్లో పీసీసీఎఫ్ డోబ్రియాల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. చిన్నతనంలో పిచ్చుకలతో ఆడుకున్న రోజులు అందరికీ గుర్తేనని, ఆ మధుర స్మృతులు రానున్న తరాలకు అందించాలంటే పర్యావరణ రక్షణ అందరి కర్తవ్యం కావాలన్నారు. ప్రాధాన్యతగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం, అడవుల పునరుద్దరణ చేయటంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, ప్రకృతి పునరుజ్జీవనం చెందుతోందని అన్నారు.

స్కూలు పిల్లల్లో అవగాహన పెంపుతో పాటు, వాకర్స్ అసోసియేషన్, స్వచ్చంద సంస్థలు పర్యావరణ హిత కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని డోబ్రియాల్ కోరారు. ప్రభుత్వం, అటవీ శాఖ చర్యల వల్ల తెలంగాణలో అడవులు, పర్యావరణం బాగా మెరుగుపడిందని, జంతువులు, పక్షి జాతుల సంచారం కూడా గతంతో పోల్చితే స్పష్టంగా పెరిగిందని కార్యక్రమంలో పాల్గొన్న పక్షి ప్రేమికులు అన్నారు. కేబీఆర్ పార్కు బర్డ్ వాక్ లో పాల్గొన్న ఔత్సాహికులు తమ కెమెరాల్లో పలు రకాల పక్షులను వారు బంధించారు.

ప్రపంచ పిచ్చుకల దినోత్సవంలో భాగంగా కేబీఆర్ పార్కులో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. బర్డ్ వాచింగ్ తో పాటు, పర్యావరణ అవగాహన, అటవీ ప్రాంతాల్లో చేయదగిన, చేయకూడని పనులు, పిట్టుగూళ్ల పంపిణీ, స్కూలు పిల్లలకు డ్రాయింగ్, స్లోగన్స్ తయారీ, సిగ్నేచర్ కాంపెయిన్ లను నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ బి.సైదులు, బర్డింగ్ పాల్స్, డెక్కన్ బర్డర్స్, నేచర్ లవర్స్ సొసైటీల ప్రతినిధులు, వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు, హైదరాబాద్ జిల్లా అటవీ అధికారి ఎం.జోజి, కేబీఆర్ పార్కు సిబ్బంది, వాకర్స్ అసోసియేష్ ప్రతినిధులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =