దేశంలో కొత్తగా 18870 కరోనా కేసులు, 28178 రికవరీలు నమోదు

18870 New Positive Cases 378 Deaths Reported Today, Coronavirus Cases, coronavirus cases in india state wise, coronavirus cases in india today state wise, coronavirus cases india, coronavirus india, India Coronavirus, India Covid-19 Updates, Mango News, New Confirmed Corona Cases, total corona cases in india today, total corona positive in india, Update on COVID-19 Vaccine, India’s COVID vaccination, Covid-19 vaccination update

భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. వరుసగా రెండో రోజు కూడా 20 వేలకంటే తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే రోజువారీ పాజీటివిటీ రేటు 1.25 శాతంగా నమోదవగా, గత 30 రోజులుగా పాజీటివిటీ రేటు 3 శాతం కన్నా తక్కువగానే నమోదవుతుంది. దేశవ్యాప్తంగా కొత్తగా 18,870 పాజిటివ్ కేసులు నమోదవగా, 378 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 29, బుధవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 3,37,16,451 కు, మరణాల సంఖ్య 4,47,751 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

గత 24 గంటల వ్యవధిలో 28,178 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న అయిన వారి మొత్తం సంఖ్య 3,29,86,180 కు చేరుకుంది. ఇక కరోనా రికవరీ రేటు 97.83 శాతం గానూ, మరణాల రేటు 1.33 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 2,82,520 (0.84%) మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − seven =