దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ: కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ లకు అనుమతి

coronavirus news, Coronavirus News Updates, coronavirus vaccine, Coronavirus Vaccine In India, Coronavirus Vaccine News, Coronavirus Vaccine Updates, Covaxin Vaccine, COVID 19 Vaccine, Covishield, Covishield Coronavirus Vaccine, Covishield Vaccince, Covishield Vaccince In India, DCGI Approved Serum’s Covishield and Bharat Biotech’s Covaxin Vaccines, Mango News Telugu

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రెండు కీలక వ్యాక్సిన్ లకు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. హైదరాబాద్ కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ పూర్తి స్వదేశీయంగా అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్‌” కరోనా వ్యాక్సిన్ కు, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ‌-ఆస్ట్రాజెనికా సౌజన్యంతో “కోవిషిల్డ్” పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆదివారం నాడు ఆమోదం తెలిపింది.

ముందుగా ఈ రెండు వ్యాక్సిన్ లకు సంబంధించిన నివేదికలు, సమాచారాన్నిసెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ రెండ్రోజుల పాటు సుదీర్ఘంగా పరిశీలించి ఆమోదం తెలిపింది. పల్మోనాలజీ, ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, పీడియాట్రిక్స్, ఇంటర్నల్ మెడిసిన్ రంగాలకు చెందిన డొమైన్ నాలెడ్జ్ నిపుణులతో కూడిన సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ఈ వ్యాక్సిన్ లకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలంటూ డీసీజీఐకు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో నిపుణల కమిటీ సిఫార్సు అనంతరం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ కరోనా వ్యాక్సిన్ లకు డీసీజీఐ కూడా ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ వ్యాక్సిన్స్ కు సంబంధించిన ఇతర పక్రియ కూడా త్వరితగతిన పూర్తయితే, దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ అతిత్వరలోనే ప్రారంభం కానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =