ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా సీవీ ఆనంద బోస్ ప్ర‌మాణ‌ స్వీకారం, హాజరైన సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

CV Ananda Bose Sworn in as Governor of West Bengal Today Attends CM Mamata Banerjee,CV Ananda Bose Oath as Governor, West Bengal Governor, CM Mamata Banerjee Attended,Mango News,Mango News Telugu,Governor of West Bengal,CV Ananda Bose West Bengal Governor,West Bengal Governor CV Ananda Bose,CV Ananda Bose Former IAS,CV Ananda Bose Latest News And Updates,CM Mamata Banerjee,CM Mamata Banerjee News and Live Updates,West Bengal CM Mamata Banerjee,West Bengal Latest News And Updates

పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో కోల్‌క‌తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, లెఫ్ట్ ఫ్రంట్ చైర్‌పర్సన్ బిమన్ బోస్ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి బెంగాల్ ప్ర‌తిప‌క్ష బీజేపీ నేత సువేందు అధికారి హాజ‌రు కాకపోవడం విశేషం. కాగా 1977 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన ఆనంద బోస్ ను కేంద్రం నవంబర్ 17న పశ్చిమ బెంగాల్ కొత్త గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక గతంలో ఆయన కోల్‌క‌తాలోని జాతీయ మ్యూజియంలో అడ్మినిస్ట్రేట‌ర్‌గా సేవలందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here