నవంబర్ 25న ఢిల్లీలో బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి?

Telangana Congress Senior Leader Marri Shashidhar Reddy Likely to Join BJP on NOV 25 at Delhi,Marri Shasidhar Reddy to join BJP, Marri Shasidhar Reddy in Delhi on Nov 25,T-Congress Leader Marri Shashidhar Reddy,Marri Shashidhar Reddy Resigned,Shashidhar Reddy Resigned For T-Congress,Mango News,Mango News Telugu,Marri Shashidhar Reddy Latest News and Updates,Telangana Congress,Telangana Latest News And Updates,Telangana Congress Party,Telangana Congress Party News And Live Updates,Marri Shashidhar Reddy Join BJP?,Shashidhar Reddy Meet Modi,Shashidhar Reddy News And Live Updates,

తెలంగాణ సీనియర్ నేత, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఎ) మాజీ వైస్ చైర్మన్  మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మర్రి శశిధర్ రెడ్డి నవంబర్ 25, శుక్రవారం నాడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్, వెంకట్ స్వామి సహా పలువురు కీలక రాష్ట్ర నేతలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది.

కాంగ్రెస్ కు రాజీనామా చేయడంపై మర్రి శశిధర్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పార్టీ పనితీరుపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా బాధతో కాంగ్రెస్ పార్టీతో ఉన్న బంధాన్ని తెంచుకుంటున్నానని, తన రాజీనామా లేఖను పార్టీ అగ్రనేత సోనియాగాంధీ మరియు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్లు వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోందని, అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని శశిధర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోయిందని, శ్రేణులను సరైన దిశలో నడిపించే నాయకత్వం లేదని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్ఫష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here