కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి చేయండి..

Do these things to keep the kidneys healthy,keep the kidneys healthy,Do these things to kidneys,Mango News,Mango News Telugu,Ayurveda Tips for Kidney ,kidneys healthy,kidneys,Kidneys act as filters, body,Preventing Chronic Kidney Disease,Kidneys remove harmful substances, urine,Ayurveda Tips for Kidney Latest News,Ayurveda Tips for Kidney Latest Update,kidneys health Latest News,kidneys health Latest Updates,Ayurveda Tips Latest News
Ayurveda Tips for Kidney ,kidneys healthy,kidneys,Kidneys act as filters, body, Kidneys remove harmful substances, urine.

కిడ్నీలు శరీరంలో ఫిల్టర్‌లా పని చేస్తాయి. కిడ్నీలు శరీరంలో ఉండే హానికరమైన పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అందుకే కిడ్నీ సంబంధిత సమస్య ఏదైనా వస్తే అది మొత్తం ఆరోగ్యాన్నే ప్రభావితం చేస్తుందని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఎందుకంటే కిడ్నీలు రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి. అందుకే కిడ్నీలో ఏ భాగం పని చేయకపోయినా కూడా అది అన్ని విధులపై ప్రభావితం చూపుతుంది. కిడ్నీ తనంతట తానుగా శుభ్రపరుచుకుంటున్నా కూడా.. దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని పనులు చేయాలని డాక్టర్లు చెబుతుంటారు.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం..అంటే తగినంత నీరు తాగుతూ ఉండాలి. రోజంతా తగినంత మొత్తంలో గోరువెచ్చని మంచి నీళ్లను తీసుకోవాలి. దీనివల్ల శరీరం నుంచి విషపూరిత మూలకాలను తొలగించడంలో మంచి నీళ్లు సహాయపడతాయి. దీని వల్ల మూత్రపిండాలు సక్రమంగా పనిచేస్తాయి.

అంతేకాదు కిడ్నీల ఆరోగ్యానికి సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. ఆహారంలో తగిన మొత్తంలో పళ్లు, కూరగాయలు తీసుకోవడంతో పాటు.. ప్రాసెస్ చేసిన, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే పీచుపదార్థాలు, సోడియం తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

అంతేకాదు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలకు హాని కలుగుతుంది. అలాగే ఒబెసిటీ వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి చాలా రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు చెబుతున్నారు అందుకే ఆహార నియమాలు పాటించడంతో పాటు.. వ్యాయామాలు చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవాలి.

కిడ్నీలను జీవితాంతం సురక్షితంగా ఉంచుకోవడానికి మరో ముఖ్యమైన విషయం పెయిన్ కిల్లర్స్‌కు దూరంగా ఉండటం. కొన్ని పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అందుకే చీటికీ మాటికీ టాబ్లెట్లు వాడేవాళ్లలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయని అంటారు.

అంతేకాదు కిడ్నీల ఆరోగ్యం కోసం..ఆల్కహాల్‌తో పాటు.. కెఫిన్‌ను కూడా పరిమితంగానే తీసుకోవాలి. ఆల్కహాల్, కెఫిన్ ఎక్కువగా వాడటం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడి.. మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుంది.

అలాగే కిడ్నీల ఆరోగ్యంతో పాటు.. అసలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదు అనుకున్నవాల్లు మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామాన్ని తమ లైఫ్ స్టైల్‌లో భాగంగా మార్చుకోవాలి. అలాగే తగినంత నిద్ర కూడా ఉండాలి. ఎందుకంటే 6నుంచి 7 గంటల పాటు నిద్రపోవడం శరీరాన్ని పునరుజ్జీవింపజేయడానికి పనికివస్తుంది. దీంతో పాటు.. మనస్సు, మెదడు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. దీనివల్ల మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో ఇతర అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + six =