నాసాతో పాటు ఇస్రో కూడా డబ్బులు సంపాదిస్తోంది..

Carriers,resources, ISRO earns thousands of crores?, NASA, ISRO, NASA earning money, ISRO earning money
Carriers,resources, ISRO earns thousands of crores?, NASA, ISRO, NASA earning money, ISRO earning money

ఒకప్పుడు అంతరిక్షరంగం పేరు చెప్పగానే నాసా పేరు మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ నాసాతోనే పోటీ పడుతున్న ఇస్రో ఇప్పుడు ప్రపంచదేశాల చూపును తన వైపు తిప్పుకుంటోంది. అంతరిక్ష రంగంలో  రోజురోజుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బలమైన శక్తిగా ఎదుగుతోంది. వివిధ రకాల వాహక నౌకలను రూపొందించి అద్భుతాలు సృష్టిస్తోంది. శాటిలైట్ సర్వీసులతో పాటు వాణిజ్య పరంగా శాటిలైట్స్‌ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలోనూ  రికార్డులు నెలకొల్పుతోంది.

అంతేకాకుండా మరోవైపు అంతరిక్ష వాణిజ్యంలోనూ ఇతర దేశాలు, ప్రైవేటు కంపెనీలతో పోటీ పడుతూ మరీ ఇస్రో వరుస విజయాలను నమోదు చేస్తూ వస్తోంది. నిజానికి గడచిన 4, 5 ఏళ్ల కాలంలోనే భారత అంతరిక్ష పరిశోధన రంగంలో ఊహించని  మార్పులు జరిగాయి. దీంతో వాణిజ్యపరంగా కూడా చాలా దేశాలు, కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఇస్రో ఎలా డబ్బు సంపాదిస్తుందనే విషయాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

భారత సైంటిస్టులు ప్రతిభ, సామర్ధ్యం, ఉత్సాహంతో పనిచేస్తున్నారని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. గతంలో  ఇస్రోలో పని చేసేవారికి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల పురోగతి కుంటుపడిందనని కానీ ..ప్రధాని నరేంద్ర మోడీ రాకతో ప్రైవేట్ మార్గాల నుంచి కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. అలాగే యునైటెడ్ స్టేట్స్, రష్యా వంటి ఇతర దేశాలకు శాటిలైట్స్ ప్రయోగించడం ద్వారా వచ్చే ఆదాయం గురించి కూడా ఆయన మాట్లాడారు.

నాసాకు సగం రిసోర్సెస్ ప్రైవేట్ పెట్టుబడుల నుంచి వస్తున్నాయని గుర్తు చేసిన జితేంద్ర  సింగ్.. ప్రస్తుతం ఇస్రో కూడా దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించినట్లుగా  చెప్పుకొచ్చారు. అది ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల్లో భారత పురోగతి అని ఆయన నొక్కి  చెప్పారు. ఇండియా నుంచి ఇస్రో.. అమెరికా, రష్యాలకు చెందిన శాటిలైట్స్‌ను విజయవంతంగా తక్కువ ఖర్చుతోనే  కక్ష్యలోకి ప్రవేశపెడుతోందని.దానితోనే డబ్బు సమకూరుతుందని తెలిపారు.

వాణిజ్య ప్రయోగాల ద్వారా ఇతర దేశాల శాటిలైట్లను ప్రయోగించి ఇస్రో ఇప్పటి వరకు 4,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించినట్లు మంత్రి ప్రకటించారు. దీంతోనే చాలా  దేశాలకు చెందిన దాదాపు 430 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు చెప్పారు.  ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, యూఎస్‌ఏ జపాన్, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్,  మలేషియా, సింగపూర్, వంటి దేశాలకు ఇస్రో తన  సర్వీసులు అందించిందని ఆయన వివరించారు.

యూరోపియన్ దేశాల నుంచి 2,635 కోట్ల రూపాయలు..అమెరికా నుంచి 1,417 కోట్ల రూపాయలు సంపాదించినట్లు సింగ్ చెప్పారు. అంతేకాదు గగన్‌యాన్ మిషన్ గురించి వివరాలు తెలిపారు.  2025 ప్రారంభంలో మానవరూప రోబోట్‌ను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రో సిద్ధంగా ఉన్నట్లు జితేంద్ర సింగ్ వెల్లడించారు. అలాగే 2047లో ప్రతిష్టాత్మకమైన ‘డీప్ సీ మిషన్’ గురించి మాట్లాడిన ఆయన.. హిమాలయ, సముద్రయాన్ వంటి మిషన్ల సహాయంతో.. హిందూ మహాసముద్రం నుంచి మినరల్స్‌ను వెలికితీసే ప్రణాళికల గురించి కూడా వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + seventeen =