80 ఏళ్ల వయసులో ఫోర్బ్స్‌ జాబితాలోకి..

Entered the Forbes list at the age of 80,Entered the Forbes list,Entered at the age of 80,Forbes list at the age of 80,New Billionaire,Radico Khaitan,Lalit Khaitan, Billionaires growing in India, Forbes list,Mango News,Mango News Telugu,Billionaires in India Latest News,Billionaires in India Latest Updates,Billionaires in India Live News, Forbes list Latest Updates
New Billionaire,Radico Khaitan,Lalit Khaitan, Billionaires growing in India, Forbes list

భారతదేశంలో కుబేరుల సంఖ్య మెల్లగా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో మరో భారతీయుడి పేరు నమోదైంది. అయితే ఎనిమిది పదుల వయసులో కుబేరుల జాబితాలోకి చేరడంతో ఇప్పుడు అందరి చూపు అతనిపై పడింది. దీంతో అయన సంపద ఎంత.. ఏ కంపెనీ నడిపిస్తున్నారు.. ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

నిజం చెప్పాలంటే మద్యం వ్యాపారంలో  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం కూడా ఒకటిగా చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇలా  మద్యం వ్యాపారం చేస్తూ కుబేరుల జాబితాలో చేరిపోయారు లలిత్ ఖైతాన్. 1972-73లలో లలిత్ ఖైతాన్.. రాడికో ఖైతాన్‌ కంపెనీని స్వాధీనం చేసుకున్న తరువాత..అనుదినం కృషి చేస్తూ దానిని  ఉన్నత శిఖరాలకు చేర్చారు. అనుకున్న విధంగానే ఆ కంపెనీలో సక్సెస్ సాధించి ఎంతోమందికి రోల్ మోడల్‌గా నలిచారు.

లలిత్ ఖైతాన్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్న రాడికో ఖైతాన్‌.. ఇప్పుడు మ్యాజిక్ మూమెంట్స్ ఓడ్కా, 8 పీఎం విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ, రాంపూర్ సింగిల్ మాల్ట్‌ లాంటి బ్రాండ్లను ఉత్పత్తి చేస్తూ మార్కెట్లోకి దూసుకుపోయింది. ఈ ఏడాది ఏకంగా రాడికో ఖైతాన్‌ కంపెనీ షేర్లు 50 శాతం పెరిగి.. సంస్థ విలువ బిలియన్ డాలర్లకు చేరిపోవడంతో.. లలిత్ ఖైతాన్ పేరు బిలియనీర్ల జాబితాలోకి చేరిపోయింది.

లలిత్త్ ఖైతాన్.. అజ్మీర్ మాయో కాలేజ్, కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువు పూర్తి చేసుకున్నారు. ఈ తర్వాత బెంగుళూరులోని బీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయ్యాక అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజిరియల్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ కోర్సును పూర్తి చేశారు.

ప్రస్తుతం రాడికో ఖైతాన్‌గా పిలువబడుతున్నఈ  కంపెనీని అంతకు ముందు రాంపూర్ డిస్టిలరీ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్‌గా పిలిచేవారు. ఆ కంపెనీని 1970 ప్రారంభంలో బాగా నష్టాలున్నప్పుడు  లలిత్ ఖైతాన్ తండ్రి జీఎన్ ఖైతాన్ నష్టాల్లో ఉన్న కంపెనీని కొన్నారు. కానీ లలిత్ ఖైతాన్ చేతులలోకి మారాక..ఆ  కంపెనీ క్రమంగా వృద్ధి చెందుతూ.. ఏకంగా  ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థల జాబితాలో చోటు సంపాదించుకుంది.  ప్రస్తుతం రాడికో ఖైతాన్  కంపెనీ తమ బ్రాండ్ల మందును సుమారు 85 దేశాలలో విక్రయిస్తుందని తెలుస్తోంది

అతి తక్కువ కాలంలోనే మద్యం రంగంలో గొప్ప పురోగతి కనబరిచిన లలిత్ ఖైతాన్ 2008లో ఇన్‌స్పిరేషనల్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. అలాగే  2017లో ఉత్తర ప్రదేశ్ డిస్టిల్లర్స్ అసోసియేషన్ ద్వారా  లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు ఏకంగా ఫోర్బ్స్ జాబితాలో ఒకరుగా స్థానం సంపాదించి అందరికీ రోల్ మోడల్ గా మారారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =