ఉల్లిపాయతో వరల్డ్ రికార్డ్ ..

World Record With Onion The Uk Farmers Wonder At Farming,World Record Onion,Uk Onion Farmers,Onion World Record,Mango News,Mango News Telugu,Uk Backyard Farmer Onion,Uk Farmer Grows Enormous 9Kg Onion,Giant Onion In Line For World Record,Uk Farmer Sets World Records,World Record With Onion,Biggest Onion In The World,Giant Onion World Record, 9Kg Onion World Record,Onion World Record News & Updates

సాధించాలన్న తపన, అందరిలో తనకో గుర్తింపు తెచ్చుకోవాలన్న కసి ఉంటే చాలు..అది ఏ రంగం అయినా అనుకున్నది సాధించవచ్చు. నలుగురిలో తానొకడిగా కాకుండా.. నలుగురూ తనను గొప్పగా చూడాలన్న ఆశయం ఉంటే చాలు అంతా తేలిక చూసే పనిని కూడా ఉన్నతంగా చూపించుకోవచ్చు. అచ్చంగా ఇలాగే చేసిన ఓ యూకే రైతు.. తన చేతి పంటతో వరల్డ్ రికార్డే సృష్టించేశాడు.

యూకేలోని గ్వెర్న్సే ప్రాంతానికి చెందిన గారెత్ గ్రిఫిన్ అనే రైతు కూరగాయలను పండిస్తుంటాడు. వయసు 65 ఏళ్లు ఉన్నా..యువకులతో పోటీ పడుతూ వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అందుకే పొలంలో కొత్త కొత్త పంటలు పండిస్తూ స్థానికులను ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇదే వృత్తిని నమ్ముకున్న గారత్.. ఉల్లిపాయ మీద ప్రయోగం చేశాడు. తన పొలంలో పండే ఉల్లిపాయను భారీ సైజులో పండించాలని అనుకున్నాడు. అలా ఒకటి కాదు రెండూ కాదు ఏకంగా 12 ఏళ్లు కష్టపడి పెద్ద ఉల్లిపాయ కలను నెరవేర్చుకున్నాడు. ఇంకేమంది కళ్ల ముందే తన కల నిజమయ్యేసరికి గారెత్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు.

12 ఏళ్ల అతని కృషి ఫలించడంతో.. దాదాపు 9 కిలోల బరువున్న ఉల్లిపాయ అతని పొలంలో దర్శనమిచ్చింది.దీనిని చూసిన స్థానికులు ఈ సైజులో ఉల్లిపాయను తామెప్పుడూ చూడలేదని.. అసలు కలలో కూడా ఉల్లిపాయ ఈ సైజులో ఉంటుందని అనుకోలేదని తెగ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఇప్పుడు ఆ ఉల్లిపాయ గారెత్ గ్రిఫిన్‌ను ప్రపంచం మొత్తానికి పరిచయం చేసింది. గారెత్ పండించిన 8.9 కిలోల బరువున్న ఉల్లిగడ్డ.. ప్రపంచంలోనే అతి పెద్దదిగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో స్థానం సంపాదించుకుంది. స్వయంగా ఆ షో నిర్వాహకులు ఈ విషయాన్ని చెప్పడంతో గారెత్ ఎగిరి గంతేస్తున్నాడు.

హరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో గారెత్ ఈ ఉల్లిగడ్డను ప్రదర్శించాడు. దీంతో ఈ ఉల్లిగడ్డ ప్రపంచ రికార్డ్ సాధించిందంటూ.. హారోగేట్ ఫ్లవర్ షో దీనిని ఇన్ స్టా గ్రామ్‌లో ప్రకటించింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు ఇది నిజంగా అద్భుతమని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఉల్లి పాయ 8.9 కిలోల బరువు ఉండగా, పొడవు 21 అంగుళాలుగా ఉంది. ఉల్లిగడ్డతో రికార్డు సాధించడానికి గారెత్.. 12 ఏళ్లుగా ప్రతీ ఏడాదీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరకు ఇప్పుడు దాన్ని సాధించడంతో గరెత్ గ్రిఫిన్ ఎట్టకేలకు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.

నిజానికి ఇంత సైజు భారీ ఉల్లిపాయను పండించటానికి.. గారెత్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎక్కువ లైటింగ్‌తో పాటు ఆటోమేటిక్ ఇరిగేషన్ వంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని భారీ ఉల్లిగడ్డను పండించగలిగాడు. అయితే సాధారణ ఉల్లిగడ్డలను వంటలలో ఎలా వండుతారో.. ఈ భారీ సైజు ఉల్లిపాయలతో కూడా వంట చేసుకోవచ్చు. కాకపోతే రుచి మాత్రం కొంచెం తక్కువగా ఉంటుందట. అయితే ఈ భారీ ఉల్లిగడ్డను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ధృవీకరించబడినట్లు షో నిర్వాహకులు చెప్పారు. కాకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ దీని గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + eighteen =