డిసెంబర్ 5న విజయవాడకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పలు జాతీయ రహదారులు ప్రారంభం

President Draupadi Murmu To Visit Vijayawada On 5Th Dec To Inaugurate Several National Road Projects,President Draupadi Murmu, Draupadi Murmu Vijayawada Visit,President Visit To Vijaywada On December 5, Draupadi Murmu Inaugurate National Highways,Mango News,Mango News Telugu,National Road Projects,Vijayawada Visit By Draupadi Murmu,Indian President Draupadi Murmu,Draupadi Murmu Latest News And Updates

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా డిసెంబర్ 5న విజయవాడకు రానున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు. కేంద్ర, జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన 3 రహదారులను రాష్ట్రపతి ముర్ము వర్చువల్ గా ప్రారంభిస్తారు. అలాగే మరో జాతీయ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. దీనిపై రాష్ట్రపతి భవన్ ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. అయితే రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ పర్యటనకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ వస్తుందని అధికారులు పేర్కొన్నారు. కాగా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యాక ఏపీకి వస్తుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here