పంజాబ్ సీఎం చన్నీ, ప్రియాంక గాంధీపై ప్రధాని మోదీ ఆగ్రహం

Elections 2022 Guru Gobind Singh And Guru Ravidas Born Outside Punjab PM Slams CM Channi's Remark, Guru Gobind Singh And Guru Ravidas Born Outside Punjab, PM Slams CM Channi's Remark, Guru Gobind Singh Born Outside Punjab, Guru Ravidas Born Outside Punjab, Elections 2022, Punjab Elections 2022, 2022 Punjab Legislative Assembly elections, 2022 Punjab Assembly elections, Punjab Assembly elections, Punjab Assembly elections Latest News, Punjab Assembly elections Latest Updates, Punjab Assembly elections Live Updates, Assembly elections, CM Channi's Remark, PM Modi, Modi, Mango News, Mango News Telugu,

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా గురువారం ప్రధాని మోదీ పంజాబ్‌లోని రూమ్‌నగర్‌ వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్ సింగ్‌ చన్నీ, ప్రియాంక గాంధీ వాద్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సీఎం ఛన్నీ చేసిన వ్యాఖ్యలను మోదీ తప్పుబట్టారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చన్నీ ‘యూపీ, బీహార్‌ కే భయ్యాను పంజాబ్‌లోకి రానివ్వకండి’ అని పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వేదికపైనే ఉన్నారు. అంతేకాక నవ్వుతూ, చప్పట్లు కొట్టారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చన్నీ వ్యాఖ్యలపై ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సంత్‌ రవిదాస్‌ పంజాబ్‌లో జన్మించలేదు. యూపీలో పుట్టారు. అలాగే, గురుగోవింద్‌ సింగ్‌ కూడా పంజాబ్‌లో జన్మించలేదు. ఆయన బీహార్‌లోని పాట్నాలో జన్మించారు. వీరంతా పంజాబ్‌లో జన్మించలేదు. ఇప్పుడు మీరు వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సంత్‌ రవిదాస్‌ పేరును చెడగొడతారా అంటూ విమర్శలు గుప్పించారు. గురుగోవింద్‌ సింగ్‌కు జరిగిన అవమానాన్ని పంజాబ్‌ ప్రజలు సహిస్తారా అని అన్నారు. ఇలాంటి విభజన మనస్తత్వం ఉన్న వ్యక్తులను పంజాబ్‌ను పాలించడానికి అనుమతించకూడదని ప్రధాని మోదీ పంజాబీలను కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =