కేరళ అడవుల్లో విచిత్రం.. తొండం లేకుండా ఏనుగు పిల్ల

Elephant Calf Without Trunk Spotted by Forest Officers in Kerala,Elephant Calf Without Trunk,Elephant Without Trunk Spotted by Forest Officers,Forest Officers in Kerala,Mango News,Mango News Telugu,forest officials stationed in the dense forests,Sighting an elephant calf without a trunk,Traverse between Kerala and Tamil Nadu,A Strange thing in the Forests of Kerala, an Elephant without a Trunk, Elephant, Kerala Elephant,Elephant Calf Without Trunk News,Elephant Without Trunk Latest News,Elephant Without Trunk Live Updates

ఏనుగుకు అందం భారీ కాయం, చాంతాడంత చెవులు, ఘీంకరించే తొండం. ఏనుగు పొడవు దాదాపు ఎనిమిది అడుగులకు పైగా ఉంటుంది. ఇక దీని తొండంలో దాదాపు 40 వేల కండరాలు ఉంటాయట. ఏనుగు తొండంతో సులువుగా 300 కేజీలను ఎత్తగలదట. సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం. పెద్ద దుంగలను సులువుగా తరలిస్తుంది. అంతేకాదు కార్లు, ఇతర వాహనాలను అవలీలగా ఎత్తిపడేస్తుంది. అలాంటి తొండం ఏనుగుకు లేకపోతే ఎలా ఉంటుంది..? అసలు ఏనుగుగా గుర్తించగలగుతామా..?

ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన కేరళలో జరిగింది. అతిరప్పిల్లిలోని దట్టమైన అడవులలో అటవీ అధికారులు తొండం లేని ఏనుగు పిల్లను గుర్తించారు. కేరళ, తమిళనాడు మధ్య సంచరిస్తున్న ఏనుగుల గుంపును పర్యవేక్షిస్తున్న అధికారులు ఈ అసాధారణ దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. తరువాత గున్న ఏనుగు కదలికలను నిశితంగా పరిశీలించారు. అనంతరం తొండం లేని ఏనుగు గురించి మాట్లాడుతూ.. ఏనుగులు నీటి కోసం వెళ్లినప్పుడు మొసలి దాడులకు గురయ్యే ప్రమాదం ఉందని, అలాగే ఎత్తైన పదునైన ఫెన్సింగ్ మెటల్ వైర్లు తగలడం ద్వారా ఏనుగుల తొండాలు తెగిపోయే అవకాశం ఉందన్నారు. ఇటీవల తొండం లేకుండా గుర్తించిన మొదటి కేసు ఇదేనని బృందంలోని ఒక అధికారి తెలిపారు.

ఏనుగులు తినడానికి, తాగడానికి, సాంఘికంగా ఉండటానికి తొండం అవసరం ఉంటుంది. అయితే గున్న ఏనుగుకు తొండం లేకపోవడం దాని మనుగడపై ఆందోళన కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏనుగు పిల్ల వయస్సుకు తగ్గట్టుగానే ఆరోగ్యంగా ఉందన్నారు. దానిని సంరక్షణ శిబిరానికి తరలించాల్సిన అవసరం లేదన్నారు. తదుపరి పరిశీలన తర్వాత నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు.

ఏడు నెలల క్రితం చూసినప్పుడు ఈ చిన్న ఏనుగుకు ఎలాంటి సమస్యలు లేవని అటవీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం దాని వయసు దాదాపు నాలుగేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ ఏనుగులను అధికారులు నాలుగు సార్లు పరిశీలించారు. అయితే ఈసారి గున్న ఏనుగు చాలా బలహీనంగా ఉందని వివరించారు. సాధారణంగా తల్లి ఏనుగులు పిల్ల ఏనుగులకు నాలుగు నుంచి ఐదు ఏళ్ల వరకూ పాలు ఇస్తాయని, అసాధారణ పరిస్థితుల్లో పాలు ఇవ్వడం ఆపేస్తాయని తెలిపారు. అయితే తొండం లేని పిల్ల ఏనుగు ఆహారం లోపంతో బలహీనంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మామూలుగా వయోజన ఏనుగులు వికలాంగులను వదిలిపెట్టవని, కాలక్రమేణా పరిమితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటాయని ఫారెస్ట్ గార్డులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =