ఉదయ్‌పూర్ టైలర్‌ హత్య ఘటన, కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్ర హోంశాఖ

MHA Directs NIA to Take over Investigation of Udaipur Tailor Assassination Case, NIA to Take over Investigation of Udaipur Tailor Assassination Case, Udaipur tailor murder, NIA registers UAPA case, Udaipur Tailor Assassination Case, MHA directs NIA to take over probe into Udaipur tailor's murder, MHA has directed the National Investigation Agency to Take over Investigation of Udaipur Tailor Assassination Case, Ministry of Home Affairs has directed the NIA to Take over Investigation of Udaipur Tailor Assassination Case, MHA directs NIA, Ministry of Home Affairs, National Investigation Agency, Udaipur Tailor, Govt directs anti-terror agency NIA to Take over Investigation of Udaipur Tailor Assassination Case, Udaipur Tailor Assassination Case News, Udaipur Tailor Assassination Case Latest News, Udaipur Tailor Assassination Case Latest Updates, Udaipur Tailor Assassination Case Live Updates, Mango News, Mango News Telugu,

రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌ లో టైలర్‌ దారుణ హత్య ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌ కు చెందిన కన్హయ్య లాల్‌ అనే ట్రైలర్ ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆ హత్య వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ, ప్రధానిపై కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేయగా, మరికొందరిని విచారిస్తున్నారు. కాగా ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ప్రకటన చేసింది.

“రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో నిన్న జరిగిన కన్హయ్య లాల్ తేలి దారుణ హత్య కేసు దర్యాప్తును చేపట్టాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఏదైనా సంస్థ ప్రమేయం మరియు అంతర్జాతీయ లింకులు క్షుణ్ణంగా పరిశోధించబడతాయి” అని పేర్కొన్నారు. ఉగ్ర కోణం లేదా స్లీపర్ సెల్స్ ప్రమేయం నేపథ్యంలోనే ఈ కేసు దర్యాప్తును కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించినట్టు తెలుస్తుంది. ఎన్‌ఐఏ బృందం ఇప్పటికే ఉదయ్‌పూర్‌ కు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తును ప్రారంభించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here