పోలీసు ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితి ఐదేళ్లు సడలించాలి, నారా లోకేష్ లేఖ

TDP Leader Nara Lokesh Demands Maximum Age Limit for Police Recruitment Should Increase for Five Years,TDP Leader Nara Lokesh,Maximum Age Limit Police Recruitment,Police Recruitment Should Increase 5 Years,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితి ఐదేళ్లు సడలించాలంటూ ఏపీ పోలీస్ నియామకాల బోర్డు చైర్ పర్సన్ కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం ఓ లేఖ లేశారు. ఈ మేరకు నారా లోకేష్ లేఖను జత చేస్తూ ట్వీట్ చేశారు. “ఎట్టకేలకు వైసీపీ సర్కారు పోలీస్ ఉద్యోగాలకు జారీ చేసిన నోటిఫికేషన్ నిబంధనలతో చాలా మందికి అందని ద్రాక్షలా మారింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో పోలీసు ఉద్యోగాల భర్తీకి చివరి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతీ ఏటా పోలీసుశాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు, మూడున్నరేళ్ల తర్వాత పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది” అని చెప్పారు.

“నాలుగేళ్ల విరామం తర్వాత పోలీసు శాఖలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడడంతో ఉద్యోగార్థులు సంతోషపడ్డారు. అయితే వారి ఆనందం గరిష్ట వయో పరిమితి నిబంధనతో ఆవిరైంది. యువత ఏళ్ల తరబడి పోలీసు ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నారు. వారికి ఈ నోటిఫికేషన్ వేదన కలిగిస్తోంది. వయోపరిమితి నిబంధన వలన ఎంతోమంది అనర్హులుగా మారిపోయారు. పోలీసు ఉద్యోగార్థుల గరిష్ట వయోపరిమితి కనీసం ఐదు సంవత్సరాలు సడలించాలని డిమాండ్ చేస్తున్నాను” అని అని నారా లోకేష్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 2 =