దిగ్గజ సోషల్ మీడియా కంపెనీ ఫేస్బుక్ పేరు మారింది. ఫేస్బుక్ కంపెనీ పేరు “మెటా”గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గురువారం నాడు కంపెనీ కనెక్ట్ ఈవెంట్లో కంపెనీ పేరును మెటా గా మార్చుతున్న విషయాన్ని ప్రకటించారు. సోషల్ నెట్‌వర్క్‌ను భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీకి మార్చే క్రమంలోనే కంపెనీ పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మెటావర్స్‌ను నిర్మించడంలో మెటా సహాయం చేస్తోందని, సోషల్ కనెక్ట్ యొక్క తదుపరి అధ్యాయానికి స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు.
అయితే కంపెనీకి సంబంధించిన యాప్స్ అయిన ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, మెస్సెంజర్, వాట్సాప్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని, అవే కొనసాగుతాయని పేర్కొన్నారు. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ, “ఈరోజు ఫేస్బుక్ కంపెనీ ఇప్పుడు మెటా అని ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను. మా లక్ష్యం అలాగే ఉంది, ఇప్పటికీ ప్రజలను ఒకచోట చేర్చడంతో పాటుగా మా యాప్‌లు మరియు వారి బ్రాండ్లు ఏవి మారడం లేదు” అని ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ