టీ20 ప్రపంచ కప్: ఫైనల్‌ చేరిన పాకిస్తాన్, సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం

T20 World Cup 2022 Pakistan Beats NewZealand by 7 Wickets in1st Semi Final Match To Enter The Finals,T20 World Cup 2022,Pakistan Beats New Zealand,Pakistan To Worldcup Finals,Mango News,Mango News Telugu,Pakistan Vs New Zealand,T20 Worldcup Latest News And Updates,T20 World Cup News And Live Updates, Pakistan T20 Worldcup,India T20 worldcup, Viart Kohli, Rizwan,Indian Team Captian,Pakistan Team Captain, Rohit Sharma,Indian Cricket Team,New Zealand Captain kane Williamson

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌లో దాయాది పాకిస్తాన్‌ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. కివీస్‌ జట్టు నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ మొత్తం 20 ఓవర్లలో 152 పరుగులు చేసింది. ఆ జట్టులో డారిల్‌ మిచెల్‌ (53 పరుగులు) హాఫ్‌ సెంచరీ చేయగా, కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (46 పరుగులు) రాణించాడు. డేవిన్‌ కాన్వే (21), జేమ్స్‌ నీషమ్‌ (16) భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి కివీస్‌ 152 పరుగులు చేయగలిగింది. పాక్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది 4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు.

అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ టోర్నీలో తొలిసారిగా పవర్ ప్లేలో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ బాబర్‌ ఆజామ్‌ (53), మహమ్మద్‌ రిజ్వాన్‌ (57) చెరో హాఫ్‌ సెంచరీతో చెలరేగి ఆడారు. దీంతో పాకిస్తాన్ 12 ఓవర్లు ముగిసేలోపు ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 102 పరుగులు చేసింది. ఇక 13వ ఓవర్‌లో బాబర్‌ ఆజామ్‌ పెవిలియన్‌ చేరడంతో, క్రీజులోకి వచ్చిన మహమ్మద్‌ హారిస్‌ వేగంగా ఆడి 30 పరుగులు చేశాడు. ఆట ఆఖర్లో హారిస్‌ ఔటవ్వడంతో మ్యాచ్‌ కొంత ఉత్కంఠగా మారింది. కానీ క్రీజులో ఉన్న షాన్‌ మసూద్‌, అహ్మద్‌లు ఫర్వాలేదనిపించడంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే పాక్‌ లక్ష్యాన్ని చేధించింది. తద్వారా ఈ వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌కు చేరుకున్న జట్టుగా నిలిచింది. ఇక రెండో సెమీస్‌లో భాగంగా గురువారం టీమిండియా పటిష్ట ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ క్రమంలో ఆదివారం ఫైనల్‌లో పాకిస్తాన్‌ తలపడబోయేది ఏ జట్టో రేపు తేలనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 19 =