స్వామి వివేకానంద జయంతి: కర్నాటకలో 26వ నేషనల్ యూత్ ఫెస్టివల్ ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Narendra Modi Inaugurated the 26th National Youth Festival in Hubballi Karnataka Today, 26th National Youth Festival in Hubballi Karnataka Today, PM Narendra Modi Inaugurated the 26th National Youth Festival, Prime Minister Narendra Modi, 26th National Youth Festival, Hubballi Karnataka, Narendra Modi, 26th National Youth Festival News, 26th National Youth Festival Latest News And Updates, 26th National Youth Festival Live Updates, Mango News, Mango News Telugu

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (జనవరి 12, గురువారం) సాయంత్రం 4 గంటలకు కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బలిలో 26వ జాతీయ యువజనోత్సవాలను (నేషనల్ యూత్ ఫెస్టివల్) ప్రారంభించారు. స్వామి వివేకానందుని ఆదర్శాలు, బోధనలు మరియు సేవలను గౌరవించడం కోసం ఆయన జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కర్ణాటకలోని హుబ్బల్లి-ధార్వాడ్‌లో జనవరి 12 నుండి 16 వరకు “విక్సిత్ యువ-విక్సిత్ భారత్” అనే థీమ్‌తో ఈ యూత్ ఫెస్టివల్ జరుగనుంది. ఈ ఫెస్టివల్ దేశంలోని అన్ని ప్రాంతాల నుండి విభిన్న సంస్కృతులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటుగా, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో పాల్గొనేవారిని ఏకం చేస్తుందని చెప్పారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ, క‌ర్ణాట‌క‌లోని హుబ్బ‌లి ప్రాంతం దాని సంస్కృతి, సంప్రదాయం మరియు విజ్ఞానానికి ప్రసిద్ధి చెందిందని, ఇక్కడ ఎందరో మహానుభావులకు జ్ఞానపీఠ్ పురస్కారం లభించిందని అన్నారు. ఈ ప్రాంతం పండిట్ కుమార్ గంధర్వ్, పండిట్ బస్వరాజ్ రాజ్‌గురు, పండిట్ మల్లికార్జున్ మన్సూర్, భారతరత్న శ్రీ భీమ్‌సేన్ జోషి మరియు పండిత గంగూబాయి హంగల్ వంటి ఎందరో గొప్ప సంగీత విద్వాంసులను తయారు చేసిందని తెలిపి, ఈ వ్యక్తులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. 2023లో జాతీయ యువజన దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ, ఒకవైపు జాతీయ యువజనోత్సవం ఉత్సహంగా ఉందని, మరోవైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. “లేవండి, మేల్కొండి మరియు లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి” అని స్వామి వివేకానంద సూత్రాన్ని ప్రధాని గుర్తు చేస్తూ, ఇది భారతదేశ యువత యొక్క జీవిత మంత్రం అని అన్నారు. అమృత్‌కాల్‌లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మనం మన కర్తవ్యాలను అర్థం చేసుకోవాలని అన్నారు.

కర్ణాటక భూమితో స్వామి వివేకానందకు ఉన్న అనుబంధాన్ని ప్రధాని మోదీ వెల్లడించారు. స్వామీజీ చాలాసార్లు కర్ణాటకను సందర్శించారని, స్వామి వివేకానంద చికాగో పర్యటనకు ముఖ్య మద్దతుదారుల్లో మైసూర్ మహారాజా ఒకరని పేర్కొన్నారు. “స్వామీజీ యొక్క భారత్ భ్రమన్ దేశం యొక్క చైతన్యం యొక్క ఐక్యతకు నిదర్శనం మరియు ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి శాశ్వత ఉదాహరణ” అని ప్రధాని అన్నారు. స్వామి వివేకానందజీని ఉటంకిస్తూ, “యువశక్తిని కలిగి ఉన్నప్పుడే భవిష్యత్తు మరియు దేశం అభివృద్ధి సులభం అవుతుంది” అని ప్రధాని అన్నారు. దేశం పట్ల తమ కర్తవ్యాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అతి చిన్న వయస్సులోనే అసాధారణ విజయాలు సాధించిన అనేక మంది వ్యక్తులను కర్ణాటక భూమి దేశానికి బహుమతిగా ఇచ్చిందని పేర్కొన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న జాతీయ లక్ష్యాల స్వభావాన్ని ప్రధాని గుర్తు చేస్తూ, ఈ 21వ శతాబ్దపు సమయం చాలా ముఖ్యమైనదని, నేడు భారతదేశం భారీ యువ జనాభాతో కూడిన యువ దేశంగా ఉందని అన్నారు. “భారత ప్రయాణానికి యువశక్తి చోదక శక్తి” అని అన్నారు. దేశ నిర్మాణానికి రానున్న 25 ఏళ్లు చాలా ముఖ్యమైనవని, యువశక్తి కలలు మరియు ఆకాంక్షలు భారతదేశం యొక్క దిశ మరియు గమ్యాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు. యువశక్తి యొక్క అభిరుచి భారతదేశ మార్గాన్ని నిర్ణయిస్తుందన్నారు. భారతదేశం నేడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, దానిని టాప్ 3లోకి తీసుకెళ్లడమే మన లక్ష్యం అని ప్రధాని అన్నారు. వ్యవసాయం మరియు క్రీడా రంగాలలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలను పునరుద్ఘాటించిన ప్రధాని, ఈ విప్లవానికి యువత యొక్క శక్తికి కృతజ్ఞతలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − eleven =