తన కొత్త పార్టీ పేరును ప్రకటించిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, జెండా ఆవిష్కరణ

Former Jammu and Kashmir CM Ghulam Nabi Azad Announced Name of his New party and Unveils Flag, Former Jammu and Kashmir CM Ghulam Nabi Azad, Jammu and Kashmir CM Ghulam Nabi Azad, Ghulam Nabi Azad, Ghulam Nabi Azad New Party, Mango News, Mango News Telugu, Ghulam Nabi Azad Announces His New Political Party, Ghulam Nabi Azad Launches His New Party , Ghulam Nabi Azad Floats New Party, Gna Unveils The Flag Of His New Democratic Azad Party, Democratic Azad Party, Democratic Azad Party Flag

దేశ రాజకీయాల్లో సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి, కొత్త పార్టీని స్థాపించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. సోమవారం ఉదయం గులాం నబీ ఆజాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తన పార్టీకి ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ అనే పేరు ఖరారు చేసినట్టు తెలిపారు. అలాగే నీలం, తెలుపు, ఆవరంగులతో కూడిన పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. జమ్మూ కాశ్మీర్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ రిజిస్ట్రేషన్, విధానాలు, ప్రచారం వంటి వాటిపై గులాం నబీ ఆజాద్ దృష్టి సారించారు.

ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నెల రోజుల తర్వాత తన పార్టీ పేరును ఆజాద్ ప్రకటించారు. పార్టీ పేరుకోసం సూచనలు కోరగా మొత్తం 1500 పేర్లు సూచించారని, పార్టీ పేరు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, స్వతంత్రంగా ఉండాలని భావించడంతో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అనే పేరు పెట్టాలని నిర్ణయించామన్నారు. జమ్మూ కాశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదా తేవడం, భూమిపై హక్కు మరియు స్థానిక నివాసులకు ఉపాధి తన డీఏపీ పార్టీ దృష్టి పెడుతుందని గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here