మూడో వన్డే కూడా మనదే.. 3-0 తో సిరీస్‌ గెలుచుకున్న టీమిండియా

IND VS WI 3rd ODI Highlights India Beat West Indies By 96 Runs Sweep Series 3-0, IND VS WI, 3rd ODI Highlights, IND VS WI 3rd ODI Highlights, India Beat West Indies By 96 Runs, India Sweep Series 3-0, ODI Match, One Day International, One Day International between West Indies and India, Cricket, Cricket Latest News, Cricket Latest Updates, Cricket Live Updates, ODI between West Indies and India, West Indies, India, Mango News, Mango News Telugu,

అనుకున్నదే అయింది. టీమిండియా మూడో వన్డే కూడా గెలుచుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా.. ఆడిన మొదటి సిరీస్ లోనే క్లీన్‌స్వీప్‌ సాధించటం విశేషం. వెస్టిండీస్‌ కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయింది. భారత్ నిర్ధేశించిన 266 పరుగుల విజయ లక్ష్యంతో బరికి దిగిన వెస్టిండీస్ 169 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ 34 పరుగులు చేశాడు. ఒడియన్ స్మిత్ 36 పరుగులు చేసి ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలింగ్ విభాగంలో ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ తలో మూడు వికెట్లు తీశారు. కాగా, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ చెరో రెండేసి వికెట్లు తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది.

ఆతిథ్య జట్టు టాప్ ఆర్డర్ విఫలమైంది. టీమిండియా కెప్టెన్ రోహిత్, శిఖర్ ధవన్ స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అయితే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌ల భాగస్వామ్యం భారత్ ను పటిష్ట స్థితిలో నిలిపింది. శ్రేయాస్ 111 బంతుల్లో 80 పరుగులు, పంత్ 54 బంతుల్లో 56 పరుగులు చేశాడు. వాషింగ్టన్‌ సుందర్‌ 34 బంతుల్లో 33 పరుగులు, దీపక్ చాహర్ 38 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించటంలో తమవంతు పాత్ర పోషించారు. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, అల్జారీ జోసెఫ్ మరియు హేడెన్ వాల్ష్ చెరో రెండు ఔట్‌లను సాధించారు. కోలకోతా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఫిబ్రవరి 16 నుంచి జరగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + ten =