ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. రేపటి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుపై సందిగ్ధం

BRS MLC Kavitha To Appear Before ED Today For Inquiry in Delhi Liquor Scam Case Tomorrow,BRS MLC Kavitha To Appear Before ED,Inquiry in Delhi Liquor Scam Case Tomorrow,BRS MLC Kavitha in Delhi Liquor Scam Case,Mango News,Mango News Telugu,,MLC Kavitha To Attend Hearing on March 20th,ED Interrogation In Delhi Liquor Scam,MLC K Kavitha ED Interrogation,BRS MLC Kavitha For ED Enquiry Again,MLC Kavitha ED Enquiry Today,Delhi Liquor Scam Case Latest Updates,BRS MLC Kavitha Live News,BRS MLC Kavitha Latest Updates,Delhi News Highlights,MLC Kavitha ED Enquiry Live News

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరవ్వాల్సి ఉంది. అయితే ఆమె ఈ విచారణకు హాజరవుతున్నారు? లేదా? అనేదానిపై సందిగ్దత నెలకొంది. వాస్తవానికి మార్చి 16నే ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆమె వెళ్లకపోవడంతో ఢిల్లీలో కొన్ని గంటలపాటు హైడ్రామా నడిచిన విషయం తెలిసిందే. 16న విచారణకు తాను రాలేనని కవిత ఈడీ అధికారులకు సమాచారమివ్వడం, దీనికి ఈడీ స్పందించకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే కొద్దిసేపు తర్జనభర్జనల అనంతరం ఈడీ ఎమ్మెల్సీ కవిత అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించింది.

దీంతో మరోసారి కవితకు నోటీసులు జారీ చేసిన ఈడీ, ఈనెల 20న వ్యక్తిగతంగా విచారణకు రావాలంటూ అందులో పేర్కొంది. అయితే అంతకుముందు మార్చి 11న తొలిసారి ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఇదే కేసుకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయనను ఈనెల 18న ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో కోరింది. అయితే శనివారం ఆయన విచారణకు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here