తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ లో మార్పులు

TS EAMCET 2023 Schedule of Engineering Steam Examination Changed,TS EAMCET 2023 Schedule,Engineering Steam Examination Changed,TS EAMCET 2023 Schedule Changed,TS EAMCET 2023 Steam Examination Changed,Mango News,Mango News Telugu,TS EAMCET 2023 Exam Dates Changed,Telangana TS EAMCET 2023 Dates Revised,EAMCET Exam Dates Changed,TS Eamcet 2023 Weightage,TS Eamcet 2023 Official Website,TS EAMCET 2023 Latest News,TS EAMCET 2023 Latest Updates

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే టీఎస్ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ఇప్పటికే విడుదల అయిన విషయం తెలిసిందే. తాజాగా ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ లో మార్పులు చోటుచేసుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప‌రీక్షలు, మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ప‌రీక్షలు జరగనున్నట్టు ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో వెల్లడించింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు, మే 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎంసెట్ అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్(యూజీ) పరీక్షను మే 7న నిర్వహించనున్నట్టు ప్రకటించడం, అలాగే మే 7,8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కూడా కొన్ని ప‌రీక్ష‌ల నిర్వహించనున్న కార‌ణంగా ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. దీంతో ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో జరగనున్నాయి. అయితే ఎంసెట్ అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవని, య‌థాత‌థంగా మే 10, 11 తేదీల్లో నిర్వ‌హించనున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here