గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: భారత్ జోడో యాత్రకు విరామం.. నేడు సూరత్, రాజ్‌కోట్‌లలో ప్రచారం నిర్వహించనున్న రాహుల్ గాంధీ

Gujarat Assembly Elections 2022 Amid Bharat Jodo Yatra Rahul Gandhi To Address Rallies In Surat And Rajkot Today,Gujarat Assembly Elections, Bharat Jodo Yatra Break,Rahul Gandhi Campaign, Surat And Rajkot Today,Mango News,Mango News Telugu,Gujarat Assembly Elections, Bharat Jodo Yatra, Rahul Gandhi Rallies In Surat,Rahul Gandhi Rallies In Rajkot,Surat,Rajkot,Gujarat,Gujarat Elections,Gujarat Elections 2022,Bharat Jodo Yatra Schedule

వచ్చే నెలలో రెండు దశల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక తొలిసారి సోమవారం గుజరాత్‌లో పర్యటించనున్న ఆయన రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో నేడు రాహుల్ నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’కు ఆయన విరామం ప్రకటించారు. ఇప్పటికే గుజరాత్ చేరుకున్న రాహుల్ గాంధీ సూరత్ మరియు రాజ్‌కోట్‌లలో జరుగనున్న కాంగ్రెస్ పార్టీ ర్యాలీలలో పాల్గొని అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆయన సూరత్ జిల్లాలోని మహువాలో మరియు రాజ్‌కోట్ నగరంలో ర్యాలీలు మరియు బహిరంగసభలలో పాల్గొననున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గుజరాత్ ఎన్నికల కోసం పార్టీ ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది.

ఇక 182 మంది సభ్యులున్న గుజరాత్‌ అసెంబ్లీకి డిసెంబర్ 1 మరియు 5 తేదీల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న ప్రకటించనున్నారు. కాగా ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలో సాగుతోంది. మహారాష్ట్రలో ప్రవేశించడానికి ముందు, యాత్ర ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో పూర్తయింది. కన్యాకుమారిలో మొదలైన ఈ జోడో యాత్ర కశ్మీర్ వరకు దాదాపు 3,500 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇదిలావుండగా, భారతీయ జనతా పార్టీ (బిజెపి) కూడా ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నాయకులు, జాతీయస్థాయి నేతలు గుజరాత్‌లో ప్రచారం నిర్వహిస్తుండగా, ఈరోజు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పలుచోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొని, బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here