మెగాస్టార్ చిరంజీవికి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ అవార్డు, అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Congratulates Megastar Chiranjeevi for Honoured with IFFI Indian Film Personality of the Year-2022 Award,Pawan Kalyan Congratulates Chiranjeevi,Megastar Chiranjeevi,Indian Film Personality of the Year-2022,IFFI Award 2022,Indian Film Personality Award, Mango News,Mango News Telugu,Chiranjeevi IFFI Award 2022,Chiranjeevi IFFI Award,Chiranjeevi Latest News And Updates,Megastar Chiranjeevi News And Updates,Megastar Of Tollywood, Tollywood Latest News,Latest Tollywood Releases,Telugu Movies, Telugu Movies News,

ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్​ చిరంజీవికి ఐఎఫ్ఎఫ్ఐ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డ్ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవికి ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య చిరంజీవిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022’ పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు.

“గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here