వైద్యంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానం, 3 రోజుల్లో 58 టిఫా స్కానింగ్‌ యంత్రాలు ప్రారంభం: మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Says Telangana Stands At Third Place In Health Sector In The Country,Telangana Ranks Third In Indian Medicine, 58 Tifa Scanning Machines Started In 3 Days,Minister Harish Rao,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన ఏఎన్‌ఎంల 2వ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన నాడు 5 మెడికల్ కాలేజ్ లు ఉంటే, రాష్ట్రంలో ఇప్పుడు ఆ సంఖ్య 17 కు పెరిగిందన్నారు. ఈ నెలలో 2000 పల్లె దవాఖానాలును రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. వైద్యంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందనన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు చివరి స్థానంలో ఉందని, డబుల్ ఇంజిన్ ట్రబుల్ ఇంజిన్ తప్ప పేదలకు ఎలాంటి లాభం లేదని బీజేపీ ఉద్దేశించి విమర్శించారు.

అలాగే రెండు మూడు రోజుల్లో 58 టిఫా స్కానింగ్‌ యంత్రాలు ప్రారంభమవుతాయని, జనవరి వరకు అన్ని జిల్లాల్లో టీ డయాగ్నొస్టిక్ కేంద్రాల ఏర్పాటు జరుగుతుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. “ఇవాళ ఏఎన్‌ఎంల రెండో మహా సభలు జరపడం సంతోషం. మీకు అభినందనలు. కరోనా సమయంలో మీరు మంచి సేవలు అందించారు. మీ సేవలు అమూల్యం. కరోనా సమయంలో ముగ్గురు పని చేశారు. వైద్యారోగ్య, పారిశుద్ధ్య, పోలీసులు పని చేశారు. ప్రాణాల్ని సైతం లెక్క చేయలేదు. అలాంటి ప్రయత్నంలో కొందరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ప్రాథమిక వైద్యం అందించడంలో మీది కీలక పాత్ర. ప్రివెన్శన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు, అందులో మీది కీలక పాత్ర. బీపీ, షుగర్, కేన్సర్ వ్యాది ఉన్నట్లు చాలా మందికి తెలియదు. వారిని గుర్తించి, ముందుగా చికిత్స అందిస్తే, దీర్ఘ కాల రోగాలు రావు. మీరు ఎంత బాగా పని చేస్తే, అంత మంచి రాష్ట్రం అవుతుంది. హైదరాబాద్ లో 350 బస్తీ దవాఖానలు సూపర్ హిట్ అయ్యాయి. బస్తీ దవాఖానల వల్ల గాంధీ, ఉస్మానియ, ఫీవర్ ఆసుపత్రుల్లో ఓపీ తగ్గింది. జిల్లాలో కూడా బస్తీ దవాఖానలు పెడుతున్నాం. మొత్తం 500 ఏర్పాటు చేస్తున్నాం. ఎఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖనలుగా అప్ గ్రేడ్ చేస్తున్నాం. 2004లో సర్కారు వైద్యం ఎలా ఉందో.. ఇపుడు ఎలా ఉందో దానికి మీరే సాక్ష్యం. పేదవాడు గతంలో ఉస్మానియా, గాంధీ వెళ్ళేవారు. ఈ తరహా వైద్యం మీ జిల్లాలోనే అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. అన్ని ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కీమో, రెడీయో థెరపీ తెస్తున్నాం. అరోగ్య తెలంగాణ నిర్మాణంలో కలిసి శ్రమిద్దాం” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =