ఐపీఎల్-2023 మినీ వేలం: 405 మంది ఆటగాళ్లతో తుదిజాబితా విడుదల, డిసెంబర్ 23న కొచ్చిలో వేలం

IPL 2023: Player Auction Final List Announced with 405 Players,IPL-2023 Mini Auction,Final list of 405 players released,IPL auction on December 23 in Kochi,mango news,mango news telugu,IPL-2023 Mini Auction, 714 Indian IPL Auction, 277 Foreign Players IPL Auction,Total 991 Players in IPL Mini Auction,IPL Mini Auction 2023,IPL Mini Auction,IPL Mini Auction Latest News and Updates,IPL Mini Auction News and Live Updates,Mango News,Mango News Telugu,IPL 2023 Player Auction,IPL Player Auction,IPL Player Auction 2023,IPL 2023,IPL News and Updates

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2023 కోసం ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియ కొచ్చి వేదికగా డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జరగనుంది. ఈ సీజన్ లో ఆడేందుకు వేలం కోసం ముందుగా 991 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. తాజాగా 10 ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్/షార్ట్ లిస్ట్ జాబితా కూడా సమర్పించడంతో, వేలంలో ఉండే 405 మంది క్రికెటర్లతో కూడిన తుది జాబితాను బీసీసీఐ మంగళవారం నాడు ప్రకటించింది. ముందుగా 991 మంది ఆటగాళ్ల జాబితా నుండి 10 జట్లు కలిసి మొత్తం 369 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశాయని, అనంతరం మరో 36 మంది అదనపు ఆటగాళ్లను కూడా జట్లు అభ్యర్థించడంతో ఐపీఎల్‌-2023 వేలంలో ప్రదర్శించబడే తుది జాబితాలో ఆటగాళ్ల సంఖ్య 405కి చేరిందని తెలిపారు. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ఒక ప్రకటన విడుదల చేశారు.

మొత్తం 405 మంది క్రికెటర్లలో 273 మంది భారత్, 132 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్ళలో 119 మంది తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళు కాగా (క్యాప్‌డ్‌ ప్లేయర్లు), 282 మంది ఇప్పటివరకు దేశానికి ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు (అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లు) మరియు నలుగురు అసోసియేట్‌ దేశాల క్రికెటర్లు ఉన్నారు. అదేవిధంగా ఐపీఎల్‌ 2023 సీజన్ కోసం ప్రస్తుతం 10 ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 87 మంది క్రికెటర్లను (విదేశీ ఆటగాళ్లు 30 మందితో కలిపి) మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది.

ఇక కనీస/బేస్ రూ.2 కోట్లు ధర జాబితాలో 19 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 11 మంది ఆటగాళ్లు వేలం జాబితాలో రూ.1.5 కోట్ల కనీస ధరతో ఉన్నారు. అలాగే 20 మంది కోటి రూపాయల కనీస ధర జాబితాలో ఉండగా, వారిలో భారత్ ఆటగాళ్లు మనీష్ పాండే మరియు మయాంక్ అగర్వాల్ కూడా ఉన్నారు.

వేలం కోసం 10 ప్రాంచైజీల ఖాతాలో ఉన్న నగదు వివరాలివే:

  1. సన్ రైజర్స్ హైదరాబాద్ – రూ.42.25 కోట్లు
  2. పంజాబ్ కింగ్స్ – రూ.32.20 కోట్లు
  3. లక్నో సూపర్ జెయింట్స్ – రూ.23.35 కోట్లు
  4. ముంబయి ఇండియన్స్ – రూ.20.55 కోట్లు
  5. చెన్నై సూపర్ కింగ్స్ – రూ.20.45 కోట్లు
  6. ఢిల్లీ క్యాపిటల్స్ – రూ.19.45 కోట్లు
  7. గుజరాత్ టైటాన్స్ – రూ.19.25 కోట్లు
  8. రాజస్థాన్ రాయల్స్ – రూ.13.2 కోట్లు
  9. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు – రూ.8.75 కోట్లు
  10. కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ.7.05 కోట్లు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 7 =