కేరళలో ఘోర విమాన ప్రమాదం: సిబ్బంది సహ 14 మంది మృతి

Air India crash in Kerala, Air India Express aircraft skids, Air India Express crash LIVE, Air India Express plane skids off runway, Air India flight crash live updates, Air India plane crash, Air India Plane Skids Off Runway In Kerala, Kerala, Kerala Plane Crash, Kozhikode Air India Express plane crash

కేరళలోని కోజికోడ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్‌ నుంచి కోజికోడ్‌కు వస్తున్న ఎయిరిండియాకు చెందిన విమానం కోజికోడ్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అవుతున్న సమయంలో రన్ వే పై నుంచి అదుపుతప్పింది. ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లి రెండుగా విరిగిపోయింది. శుక్రవారం రాత్రి 7:45 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రన్‌వేపైకి నీరు చేరడంతోనే ఈ ఘటన జరిగిననట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసం కావడంతో పైలట్‌, సిబ్బంది సహ 14 మంది   ప్రాణాలు కోల్పోయారు.

కాగా మరో పైలట్ తో పాటుగా 50 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బోయింగ్ 737 ఐఎక్స్‌ 1344 ఎయిర్ ఇండియా విమానంలో 10 మంది చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 191 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ విమాన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here