బాలాకోట్ దాడుల వీడియో ప్రోమో విడుదల

IAF Promo Video Featuring Balakot Airstrike, IAF Releases Promo Video Featuring Balakot Airstrike, IAF releases promotional video of Balakot air strike, Indian Air Force releases promo video, Indian Air Force releases promo video featuring Balakot airstrike, Mango News Telugu, national news headlines today, national news updates 2019, Promo Video Featuring Balakot Airstrike, promotional video of Balakot air strike

అక్టోబర్ 8న భారత వాయుసేన (ఐఏఎఫ్) దినోత్సవం సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్‌ను తలపించే దృశ్యాలతో కూడిన ప్రొమో వీడియోను విడుదల చేసారు. ఈ వీడియోలో పుల్వామాలో ఉగ్రవాదులు చేసిన దాడులను వివరిస్తూ, అందుకు దీటుగా భారత వాయుసేన ఎలా ప్రతిస్పందించింది అనే విషయాలను ప్రదర్శిస్తూ వాయిస్ ఓవర్ తో వీడియోను రూపొందించారు. ఫిబ్రవరి 26, 2019న మిరాజ్-2000 జెట్ విమానాలు బాలాకోట్ ప్రాంతంలోని జైష్ ఎ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన శిబిరాలను ధ్వంసం చేసాయి. ఈ వీడియోను పాక్ భూబాగంలో బాంబులు జారవిడిచే దృశ్యాలతో రూపొందించారు. పీవోకేలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ వేల మందికి శిక్షణ ఇస్తూ కుట్రలు పన్నుతోందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత వాయు సేన చీఫ్ భదౌరియా ఈ వీడియో విడుదల చేయడం విశేషం.ఈ సందర్భంగా పాకిస్తాన్ తో యుద్ధం చేసేందుకు భారత వాయుసేన సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా చొరబాట్లు ప్రయత్నాలు ఆపకపోతే మళ్ళీ బాలాకోట్ దాడులు పునరావృతమవుతాయని పాకిస్తాన్ ను హెచ్చరించారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + fifteen =