ఢిల్లీ: ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ద్ర‌వ్యోల్బ‌ణంపై కాంగ్రెస్ ఆందోళ‌న.. రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్ట్

Rahul Gandhi Priyanka Vadra Detained While Congress Protest Over Inflation Unemployment, Priyanka Vadra Detained While Congress Protest Over Inflation Unemployment, Rahul Gandhi Detained While Congress Protest Over Inflation Unemployment, Congress Protest Over Inflation And Unemployment, Congress Protest Over Unemployment, Congress Protest Over Inflation, Rahul Gandhi And Priyanka Vadra Detained, Priyanka Vadra Detained, Rahul Gandhi Detained, Congress MP Rahul Gandhi was detained by the Delhi Police, Congress MP Rahul Gandhi, INC MP Rahul Gandhi, Rahul Gandhi, Congress Protest News, Congress Protest Latest News, Congress Protest Latest Updates, Congress Protest Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై నిరసన చేపట్టిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలను ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వెలుపల పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరితో పాటు పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, శశిథరూర్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో భాగంగా ప్రధాని నివాస ముట్టడితో పాటు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌ వైపు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్‌ నేతలు భావించారు. ఈ క్రమంలో నిరసనలకు దిగిన రాహుల్, ప్రియాంకతో పాటు పలువురు ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డుకున్నారని, ప్రజా సమస్యలపై పోరాడటమే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తమ బాధ్యతని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

కాగా దీనికి ముందు కాంగ్రెస్ ఎంపీలందరూ పార్లమెంటులో హౌస్ వెలుపల నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై జీఎస్‌టీ పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా భాగంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వరకూ మార్చ్ నిర్వహించడంతో పాటు ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో రాష్ట్రపతి భవన్ వరకూ ప్రొటెస్ట్ మార్చ్‌ తలపెట్టారు. ఈ సందర్భంగా సోనియా సైతం నలుపు రంగు వస్త్రాలు ధరించడం విశేషం. ఇక రాహుల్ గాంధీ బ్లాక్ క‌ల‌ర్ షర్ట్ వేసుకోగా, ప్రియాంకా గాంధీ వాద్రా బ్లాక్ సూట్ వేసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =