ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌: నెంబర్​ 1 స్థానంలో నిలిచిన టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్

ICC ODI Bowling Rankings Team India Bowler Mohammed Siraj Becomes the New No 1 Ranked ODI Bowler,ICC ODI Bowling Rankings,Team India Bowler Mohammed Siraj,Becomes the New No 1 Ranked ODI Bowler,Mango News,Mango News Telugu,Mohammed Siraj Wife,Mohammed Siraj Stats,Mohammed Siraj Net Worth,Mohammed Siraj Dates Joined,Mohammed Siraj Age,Mohammed Siraj Wife Photo,Mohammed Siraj Ipl 2022 Price,Mohammed Siraj House,Mohammed Siraj Bowling Speed,Mohammed Siraj Ipl,Mohammed Siraj Wikipedia

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో వన్డే ర్యాంకింగ్స్ ను అప్డేట్ చేసింది. కాగా వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా రైట్-ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్ మహమ్మద్ సిరాజ్ నెంబర్​ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో వన్డే మ్యాచ్ ఆడకుండా మూడేళ్ల విరామం తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో మళ్ళీ భారత్ జట్టులో చోటు సంపాదించిన మహమ్మద్ సిరాజ్‌ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అప్పటినుంచి సిరాజ్ 20 మ్యాచ్‌ లలో 37 వికెట్లు సాధించి టీమిండియా అత్యంత స్థిరమైన ఫాస్ట్ బౌలర్‌ లలో ఒకడిగా నిలిచాడు. ఈ క్రమంలో తాజాగా 729 రేటింగ్ పాయింట్స్ తో నిలిచి ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాకింగ్స్ లో టాప్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటివరకు టాప్ లో ఉన్న న్యూజిలాండ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ ​ను మరియు ఆస్ట్రేలియా సీమర్ జోష్ హేజిల్‌వుడ్‌ లను దాటుకుని సిరాజ్ మొదటిసారిగా వన్డే బౌలర్‌ గా అగ్రస్థానంలో నిలిచాడు. ఇక వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో కుల్దీప్ యాదవ్ 20వ స్థానంలో, జస్ప్రీత్ బుమ్రా 24వ, మహమ్మద్ షమీ 32వ, శార్దూల్ ఠాకూర్ 35వ, యజేంద్ర చాహల్ 39వ స్థానాలో నిలిచారు.

ఇక మంగళవారం ఐసీసీ ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 లో భారత్ జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లు చోటు దక్కించుకోగా, బ్యాటింగ్ విభాగంలో శ్రేయాస్ అయ్యర్, బౌలింగ్ విభాగంలో మహమ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు న్యూజిలాండ్‌పై 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =