రెండో వన్డేలో విండీస్‌పై భారత్‌ జయభేరి.. వన్డేల్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా

Ind Vs WI 2nd Match Team India Set World Record For Most Consecutive Bilateral ODI Series Wins Against A Team, Team India Set World Record For Most Consecutive Bilateral ODI Series Wins Against A Team, Ind Vs WI 2nd ODI Match, Team India set record for most consecutive bilateral ODI series wins against a team, Team India breaks Pakistan's spectacular world record with ODI series, India win record 12th consecutive ODI series, Most Consecutive ODI Series win, Team India creates World Record clinches 12 Consecutive ODI series Wins Against A Team, Ind Vs WI, Ind Vs WI 2nd ODI, Ind Vs WI 2nd ODI News, Ind Vs WI 2nd ODI Latest News, Ind Vs WI 2nd ODI Latest Updates, Ind Vs WI 2nd ODI Live Updates, Mango News, Mango News Telugu,

వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్ లో చెలరేగి ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో ఇండియా కైవసం చేసుకుంది. తద్వారా వన్డేల్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు గెలిచిన జట్టుగా భారత్‌ నిలిచింది. 2006 నుంచి ఇప్పటి వరకు విండీస్‌పై వరుసగా 12 వన్డే సిరీస్‌ల్లో టీమిండియా విజయం సాధించడం విశేషం. ఇంతకుముందు జింబాబ్వేపై వరుసగా 11 వన్డే సిరీస్‌ల్లో విజయం సాధించింది. ఇక కెప్టెన్సీ చేపట్టిన తొలి సిరీస్‌లోనే ధవన్ నాయకుడిగా సత్తా చాటాడు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 311 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని భారత్‌ ముందుంచింది. ఆ జట్టు వికెట్ కీపర్-బ్యాటర్ షాయ్ హోప్‌ సెంచరీ (115; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించడంతో విండీస్‌ భారీ స్కోర్ సాధించింది. కాగా ఇది షాయ్ హోప్‌కు 100వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. అతనికి తోడు నికోలస్‌ పూరన్‌ (74; ఒక ఫోర్‌, 6 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడగా, కైల్‌ మయేర్స్‌ (39), బ్రూక్స్‌ (35) రాణించారు. ఇక చివరి ఓవర్లలో పూరన్‌ చెలరేగడంతో ఆఖరి 10 ఓవర్లలో విండీస్‌ 93 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు పడగొట్టగా, అరంగేట్ర పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ తేలిపోయాడు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా వేగంగా ఆడలేకపోయింది. ధవన్‌, సూర్యకుమార్‌ స్వల్ప స్కోర్లకే పరిమితమవగా, శుభ్‌మన్‌ గిల్ (43)‌ పర్వాలేదనిపించాడు. ఫలితంగా ఒకదశలో 79 రన్స్‌కు 3 కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమంయంలో మిడిలార్డర్ బాటర్లు శ్రేయస్‌ అయ్యర్ 63)‌, సంజూ శాంసన్‌ (54) ఆచితూచి ఆడుతూ స్కోర్‌ బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో టీమిండియా 40 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఆఖరి 10 ఓర్లలో విజయానికి 100 రన్స్‌ అవసరమైన దశలో దీపక్‌ హుడాతో కలిసి అక్షర్‌ పటేల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో వన్డేల్లో తొలి హాఫ్‌ సెంచరీ నమోదుచేశాడు. హుడా ఔటైయ్యాక టెయిలెండర్లతో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 64 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన అక్షర్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =