ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం టికెట్ల కోటా మార్చి 27న ఆన్‌లైన్‌లో విడుదల: టీటీడీ

TTD to Release Online Quota of Special Entry Darshan Tickets for April Month on March 27th,TTD to Release Online Quota of Special Entry,Special Entry Darshan Tickets for April Month,TTD Online Quota Darshan Tickets on March 27th,Mango News,Mango News Telugu,TTD to Release Online SED Tickets,Tirumala Tirupati Devasthanams Darshan Tickets,TTD 300 Ticket Online Booking Released,TTD April 2023 Quota Release Date,TTD Darshan Tickets Latest News,TTD Darshan Tickets Latest Updates

ఏప్రిల్ నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శనివారం ఒక ప్రకటన చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను మార్చి 27, సోమవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్టు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

మరోవైపు 2023, మార్చి 24న మొత్తం 63,507 యాత్రికులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు. 29,205 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ కానుకలు రూ.3.72 కోట్లు వచ్చినట్టు తెలిపారు. అలాగే స్వామివారి దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం టికెట్లు లేనివారికి సుమారు సర్వ దర్శనం కోసం దర్శన సమయం 10 గంటలు పడుతుందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here