నాపై అనర్హత వేటే కాదు, జైల్లో పెట్టినా సరే మోదీ సర్కార్ పై పోరాటాన్ని కొనసాగిస్తాను – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

Congress Leader Rahul Gandhi Sensational Comments Over Disqualification on Him,Congress Leader Rahul Gandhi Sensational Comments,Rahul Gandhi Over Disqualification on Him,Congress Leader Rahul Gandhi Disqualification,Mango News,Mango News Telugu,Rahul Gandhi MP Disqualification,Opposition Rallies Behind Congress Leader,Rahul Gandhi Disqualified Highlights,Reactions To Rahul Gandhis Disqualification,Rahul Gandhi Lok Sabha,India Opposition Leader Loses,Rahul Gandhi Disqualification Latest News

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు తర్వాత తొలిసారిగా ఆయన శనివారం మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీతో పాటు పలు ఇతర పార్టీలను కూడా షాక్ కి గురిచేసిన ఏ వ్యవహారంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. ఈ సందర్భంగా నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ అదానీ అంశాన్ని డైవర్ట్ చేయాలనుకుంటోంది. అందుకే నాపై కొంతమంది మంత్రులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నేను విదేశీ శక్తుల నుండి ఎలాంటి సహాయం కోరలేదు. ఇలాంటివాటికి భయపడి నేను ప్రశ్నలు అడగడం ఆపేది లేదు. ప్రధాని మోదీకి, వ్యాపారవేత్త అదానీకి మధ్య ఉన్న సంబంధాలను ఇకపై కూడా ప్రశ్నిస్తూనే ఉంటాను’ అని రాహుల్ గాంధీ అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘అదానీ కంపెనీల్లో ఎవరు పెట్టుబడి పెట్టారో చెప్పాలి. అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన షెల్ కంపెనీలు డిఫెన్స్ సెక్టార్‌తో ముడిపడి ఉన్నాయి. ఒక చైనా జాతీయుడికి కూడా ఈ పెట్టుబడులతో లింక్ ఉంది. అందుకే ఆ పెట్టుబడుల వివరాలేంటో దేశ ప్రజలకు చెప్పాలి. ఆ రూ. 20 వేల కోట్లు ఎక్కడివి? ఎక్కడి నుంచి అదానీ షెల్ కంపెనీల్లోకి వచ్చాయో ప్రధాని మోదీ చెప్పాలి. దేశంలో ప్రతిపక్షాలకు మీడియా మద్దతు దొరకడం లేదు. ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి పార్లమెంటులో మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు. నాపై అనర్హత వేటు వేసినా, జైల్లో పెట్టినా నేను వెనక్కి తగ్గేది లేదు. అనర్హతలు లాంటివి నన్నేమీ చేయలేవు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. నా పోరాటాన్ని యధావిధిగా కొనసాగిస్తాను. నిజాల గురించి మోదీకి ప్రశ్నిస్తూనే ఉంటాను’ అని తేల్చి చెప్పారు.

అలాగే రాహుల్ గాంధీ ఇలా అన్నారు.. ‘భారత్‌ జోడో యాత్రలో ప్రజల్లోకి వెళ్లాను. నా పేరు గాంధీ. గాంధీలు ఎప్పటికీ క్షమాపణలు చెప్పే పరిస్థితి తెచ్చుకోరు. భారత దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడటానికి ముందుంటాను. ప్రతిపక్ష నేతలపై బీజేపీ కక్షకట్టి ప్రవర్తిస్తోంది. అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్, భూపేష్ బఘేల్ మరియు తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి నాయకులు వెనుకబడిన తరగతులకు చెందినవారు కాదా? బీజేపీ మనందరినీ ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తోంది?’ అని ప్రశ్నించారు. కాగా 2019లో చేసిన మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత, ఆ తీర్పుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సంఘీభావ యాత్రను నిర్వహించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here