దేశంలో కొత్తగా 334 మందికి కరోనా పాజిటివ్, 220.64 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ

India Records 334 Fresh Corona Positive Cases Cumulative Vaccination Coverage Crosses 220.64 Cr Doses,334 Fresh Corona Positive Cases,Cumulative Vaccination Coverage,Vaccination Coverage Crosses 220.64 Cr Doses,Mango News,Mango News Telugu,India New Covid-19 Updates,Last 24 Hours Covid Reports,Worldometer Coronavirus India,All India Covid 19 Cases Today,All India Covid 19 Cases Today List,Average Covid Cases Per Day In India,Covid Cases In India In Last 24 Hours Today,Covid Cases In India In Last 48 Hours Today,Covid-19 Org India,India Covid 19 Cases News

దేశంలో గత కొన్ని రోజులుగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యలో కొంత పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 334 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 97 రోజుల తర్వాత మళ్ళీ భారత్‌లో రోజువారీ కరోనా కేసులు 300కి పైగా నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,87,496కు చేరుకుంది. ముఖ్యంగా కర్ణాటక (74), మహారాష్ట్ర (66), కేరళ (58), తెలంగాణ (26), తమిళనాడు (24) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. ఇక కరోనా వలన మరో మూడు మరణాలు ( మహారాష్ట్రలో 2, కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,775కి పెరిగింది.

ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య 2686 (0.01%) కి చేరుకుంది. అలాగే మరో 170 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,54,035 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.80 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా మార్చి 4, శనివారం ఉదయం 8 గంటల వరకు 220.64 కోట్లకుపైగా (220,64,15,484) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =