దేశంలో 15 వేల దిగువకు చేరుకున్న యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.75 శాతం

India Reports 2323 Covid-19 Cases 25 Deaths in Last 24 Hours, India, India Covid-19, 25 Deaths Reported on India May 20th, 2323 new Covid-19 cases In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, India Coronavirus, India Coronavirus Cases, India Coronavirus Deaths, India Coronavirus New Cases, India Coronavirus News, India New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, Covid-19 Updates in India, India corona State wise cases, India coronavirus cases State wise, Mango News, Mango News Telugu,

దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. తాజాగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.47 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 2,323 పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 21, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,34,145 కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనాతో 25 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,24,348 కి పెరిగింది. ముఖ్యంగా ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

దేశంలో 14,996 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.75 శాతం:

దేశంలో ప్రస్తుతం 14,996 (0.03%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 2,346 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,25,94,801 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. అలాగే మే 20, శనివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 84.63 కోట్లకు (84,63,54,733) చేరుకుంది. మే 20న 4,99,382 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here