లోక్‌సభకు హాజరైన ఎంపీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

BSP MP, BSP MP Kunwar Danish Ali, BSP MP Kunwar Danish Ali Tested for Covid Positive, BSP MP Kunwar Danish Ali Tested for Covid Positive Attends Parliament Till Yesterday, BSP MP Kunwar Danish Ali tests Covid positive, BSP MP Kunwar Danish Ali tests positive for COVID19, BSP MP who attended Lok Sabha tests positive for coronavirus, Kunwar Danish Ali, Lok Sabha MP Danish Ali, Lok Sabha MP Kunwar Danish Ali Tests Positive For Covid-19, Mango News, Mango News Telugu

ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ కు హాజరైన బీఎస్పీ ఎంపీ కున్వార్‌ డానిష్‌ అలీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకునప్పటికీ, ఈరోజు నాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. నిన్న కూడా నేను పార్లమెంటుకు హాజరయ్యాను. నా కాంటాక్ట్‌లో వచ్చిన వారందరినీ పరీక్షించుకోవాలని మరియు ఇతరులతో వేరుగా ఉండి ఐసొలేషన్ ఉండాలని అభ్యర్థిస్తున్నాను. తేలికపాటి కరోనా లక్షణాలను కలిగి ఉన్నాను మరియు త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నాను” అని ఎంపీ కున్వార్‌ డానిష్‌ అలీ పేర్కొన్నారు. మరోవైపు డిసెంబర్ 23వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 3 =