టెట్‌ పరీక్ష వాయిదా అంశంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Minister Sabitha Indra Reddy Announces Postponement of TET Exams From June 12 is Not Possible, Sabitha Indra Reddy Announces Postponement of TET Exams From June 12 is Not Possible, Telangana Minister Sabitha Indra Reddy Announces Postponement of TET Exams From June 12 is Not Possible, Telangana Education Minister Sabitha Indra Reddy Announces Postponement of TET Exams From June 12 is Not Possible, TET Exams From June 12 is Not Possible, Sabitha Indra Reddy announced that the TET exam will be held as usual on June 12, TET exam will be held as usual on June 12, TET Test Cannot Be Postponed, TET exam Cannot Be Postponed will be held as usual on June 12, Telangana Education Minister Sabitha Indra Reddy, Minister Sabitha Indra Reddy, Sabitha Indra Reddy, Telangana Education Minister, Postponement of TET Exams From June 12 is Not Possible, Postponement of TET Exams News, Postponement of TET Exams Latest News, Postponement of TET Exams Latest Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో జూన్ 12న నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పరీక్షను వాయిదా వేయడం కుదరదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. టెట్‌ పరీక్ష జరిగే జూన్ 12వ తేదీనే, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్‌బీ) ఎన్టీపీసీ సీబీటీ-2 పే లెవల్ 5, 3 మరియు 2 పోస్టుల పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. టెట్‌ పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నట్టు ప్రభుత్వం మార్చి నెలలోనే ప్రకటించగా, ఆర్ఆర్‌బీ పరీక్ష తేదీలు ఇటీవలే ప్రకటించబడ్డాయి. అయితే ఈ రెండు పరీక్షలు ఒకే రోజున జరగనుండడంతో, రెండిటికి హాజరవాల్సిన విద్యార్థుల్లో ఆందోళన నెలకుంది. ఈ నేపథ్యంలో ఒకే రోజు రెండు పరీక్షలు ఉండటం వలన అభ్యర్థులు అయోమయానికి గురవతున్నారని, కావున టెట్ పరీక్ష వాయిదా వేయాలని ఓ అభ్యర్థి ట్విట్టర్ వేదికగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను కోరారు. కాగా ఈ అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మంత్రి కేటీఆర్ కోరారు.

అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ, “ట్వీట్ చేసే ముందు ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడాను. టెట్ పరీక్షల్లో సుమారు 3.5 లక్షల మంది అభ్యర్థులు పాల్గొంటారు. టెట్ పరీక్షలను రాష్ట్రంలోని ఇతర పోటీ పరీక్షలు, మూల్యాంకనంతో ఇబ్బందిరాకుండా ప్రణాళికలు రూపొందించారు. అన్ని పరీక్షా తేదీలు ఇతర పోటీ పరీక్షలతో ఏకీభవించకుండా జాగ్రత్తగా ఎంపిక చేయబడ్డాయి. డిపార్ట్‌మెంట్ యొక్క ఇతర సన్నాహాలపై క్యాస్కేడింగ్ ప్రభావాన్ని చూపే అవకాశమున్న నేపథ్యంలో అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ టెట్ పరీక్షలను వాయిదా వేయడం సాధ్యం కాదు” అని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =