ఐక్యరాజ్యసమితిలో రష్యాకు షాక్ ఇచ్చిన భారత్.. ఉక్రెయిన్‌పై రహస్య బ్యాలెట్‌ డిమాండ్‌కు వ్యతిరేకంగా ఓటు

India Votes To Reject Russia's Demand For Secret Ballot on Ukraine in The UN General Assembly, India Votes To Reject Russia's Demand For Secret Ballot, Secret Ballot on Ukraine, UN General Assembly, Mango News, Mango News Telugu, UNGA, India votes to reject Russia's demand for secret ballot, India Votes To Reject Russia Demand For Secret Ballot, India Goes Against Russia At UNGA, India Votes To Reject Russia Demand, UNGA Latest News And Updates, UN Vote On Ukraine, United Nations General Assembly

ఐక్యరాజ్యసమితిలో భారత్ రష్యాకు షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌పై ముసాయిదా తీర్మానంపై రహస్య బ్యాలెట్ కోసం రష్యా చేసిన డిమాండ్‌ను తిరస్కరిస్తూ ఓటు వేసింది. వివరాల్లోకి వెళ్తే.. రష్యా ఇటీవల ఉక్రెయిన్‌లోని 4 కీలక ప్రాంతాల(దొనేత్సక్, ఖెర్సన్, లుహాన్స్క్ మరియు జాపోరిజ్జియా)ను ఆక్రమించి వాటిని తమ భూభాగాలుగా గుర్తిస్తూ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిని నాటో దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వ్యతిరేకించాయి. రష్యా చర్య చట్టవిరుద్దమంటూ వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అల్బేనియా రష్యా ప్రకటనను ఖండిస్తూ తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై ఓటింగ్ నిర్వహించాలని కోరింది.

అయితే రష్యా ఈ తీర్మానంపై రహస్య బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేయడంతో.. తొలుత దీనిపై ఓటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ రష్యా డిమాండ్‌కు వ్యతిరేకంగా ఓటు వేసింది. భారత్‌తో పాటు 100కు పైగా దేశాలు రష్యా డిమాండ్‌ను వ్యతిరేకించాయి. రహస్య బ్యాలెట్ కోసం రష్యా చేసిన అభ్యర్థనకు కేవలం 13 దేశాలు మద్దతు ఇవ్వగా, 39 దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఇక చైనా మరియు రష్యా ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో మొత్తం 107 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చివరికి ఓపెన్ బ్యాలెట్ విధానంలోనే ఉక్రెయిన్‌పై ముసాయిదా తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 3 =