రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ రోహిత్‌ శర్మకు గాయం, ఆసుపత్రిలో స్కానింగ్‌

India vs Bangladesh 2nd ODI: Captain Rohit Sharma Suffered a blow to his Thumb While Fielding Sent to Hospital for Scanning,India vs Bangladesh,IND vs BNG,India vs Bangladesh 2nd ODI,India vs Bangladesh ODI,IND vs BNG 2nd ODI,IND vs BNG ODI,Mango News,Mango News Telugu,Captain Rohit Sharma,Rohit Sharma Suffered Injury,Rohit Sharma blow to his Thumb,Rohit Sharma Latest News and Updates,Rohit Sharma Sent to Hospital,India Cricket Team,Bangladesh Cricket Team,India Vs Bangladesh,One Day International,ODI News and Live Updates,Bangladesh,India,

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకా లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బుధవారం జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా భారత్ కెప్టెన్ రోహిత్‌ శర్మ వేలికి గాయం కావడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో బంగ్లా బ్యాటర్ అనముల్‌ భారీ షాట్‌ ఆడగా, స్లిప్‌ లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ క్యాచ్‌ పట్టేందుకు ప్రయత్నించిన సమయంలో అతడి బొటన వేలికి గాయమైంది. దీంతో నొప్పి కారణంగా రోహిత్ శర్మ వెంటనే మైదానాన్ని వీడాడు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ భారత్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా, రోహిత్ స్థానంలో మైదానంలోకి రజత్‌ పటిదార్‌ వచ్చాడు.

రోహిత్ గాయంపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటన చేస్తూ, “2వ వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలికి దెబ్బ తగిలింది. బీసీసీఐ వైద్య బృందం అతడిని పరిశీలించింది. అతను ఇప్పుడు ఆసుపత్రిలో స్కానింగ్ కోసం వెళ్ళాడు” అని తెలిపింది. మరోవైపు రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు 271 పరుగులు చేసింది, మెహిదీ హసన్ మిరాజ్ కేవలం 83 బంతుల్లోనే సెంచరీ చేసి, వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. కాగా గాయపడిన రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ కు వస్తాడా, లేదా అనేది తెలియాల్సి ఉంది. బంగ్లాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మూడు వన్డేల సిరీస్‌ రేసులో నిలవాలంటే రెండో వన్డేలో భారత్‌ కచ్చితంగా గెలవాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 9 =