రవిచంద్రన్ అశ్విన్ కు కోవిడ్-19 పాజిటివ్, ఇంగ్లాండ్ తో టెస్టుకు ఆలస్యంగా పయనం

India vs England 5th Test Ravichandran Ashwin Tests Positive for Covid-19 Misses Flight to England, Ravichandran Ashwin Tests Positive for Covid-19 Misses Flight to England, India vs England 5th Test, Ravichandran Ashwin Tests Positive for Covid-19, Ravichandran Ashwin Misses Flight to England, Ravichandran Ashwin Health, Ravichandran Ashwin Health Condition, Ravichandran Ashwin Health News, Ravichandran Ashwin Health Reports, Ravichandran Ashwin Latest Health Condition, Ravichandran Ashwin Latest Health Report, Ravichandran Ashwin Latest News, Ravichandran Ashwin Latest Updates, Ravichandran Ashwin Positive For COVID-19, Ravichandran Ashwin Tested Positive for Covid-19, Ravichandran Ashwin Tests Coronavirus Positive, Ravichandran Ashwin Tests Covid 19 Positive, Ravichandran Ashwin Tests COVID Positive, Ravichandran Ashwin Tests Positive, Ravichandran Ashwin Tests Positive For Coronavirus, Ravichandran Ashwin tests positive for Covid 19, Mango News, Mango News Telugu,

జూలై 1 నుంచి 5 వరకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్ జట్టుతో జరగనున్న ఐదవ రీషెడ్యూల్ టెస్ట్ కోసం భారత్ టెస్టు జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న విషయం తెలిసిందే. కాగా భారత్ బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కు కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఇంకా ఇంగ్లాండ్‌కు వెళ్లలేదు. అశ్విన్ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండగా, కోవిడ్ ప్రోటోకాల్ కు అనుగుణంగా కోలుకున్న తర్వాతనే ఇంగ్లాండ్ లో జట్టుతో చేరే అవకాశమునట్టు తెలుస్తుంది. భారత్ జట్టు ఇంగ్లాండ్ బయలుదేరే ముందు అశ్విన్ కు కోవిడ్-19 పాజిటివ్ గా తేలడంతో జట్టుతో కలిసి ఇంగ్లాండ్ కి వెళ్లలేదని, జూలై 1న టెస్ట్ మ్యాచ్ ప్రారంభ సమయానికి అతను కోలుకుంటాడని భావిస్తున్నామని, అయితే జూన్ 24 నుంచి లీసెస్టర్‌షైర్‌తో భారత్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ కు మాత్రం అశ్విన్ దూరమయ్యే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

మరోవైపు స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్‌ అనంతరం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, రిషబ్ పంత్ మరియు శ్రేయాస్ అయ్యర్ కూడా సోమవారం ఇంగ్లాండ్ కు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో 5 టెస్టుల టెస్ట్ సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. అలాగే కీలకమైన ఎడ్జ్‌బాస్టన్ టెస్టు తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 7,9, 10 తేదీల్లో మూడు టీ20లు, జూలై 12,14,17 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + nine =