ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ : విజయం కోసం న్యూజిలాండ్ లక్ష్యం 139

BCCI, India Leads With 53 Runs With 4 Wickets, India Playing 11 for WTC Final, India V/S New Zealand, India v/s New Zealand WTC Day 3 Scores, India vs New Zealand WTC Final, India Vs New Zealand WTC Final 2021, India vs NZ, Mango News, New Zealand v/s India World Test Championship, score of India and New Zealand, Team India, Team India Squad, virat kohli, WTC 2021, WTC 2021 Final, WTC Final, WTC Final 2021, WTC India V/S New Zealand, WTC India V/S New Zealand Finals

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యుటీసీ) ఫైనల్ మ్యాచ్ చివరి రోజుకు చేరుకుంది. భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 170 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టుకు తోలి ఇన్నింగ్స్ లో 32 పరుగుల ఆధిక్యం ఉండడంతో, ఆ జట్టు విజయం సాధించాలంటే రెండో ఇన్నింగ్స్ లో 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది.

ముందుగా ఐదో రోజున తోలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ జట్టు 249 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ ఓపెనర్ డేవాన్‌ కాన్వే(54), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(49) పరుగులతో రాణించారు. భారత్ బౌలర్లలో షమీ 4, ఇషాంత్‌ శర్మ 3, రవిచంద్రన్ అశ్విన్‌ 2, జడేజా 1 వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి 170 పరుగులకే ఆలౌటైంది. కేవలం రిషభ్‌ పంత్‌ మాత్రమే 41 పరుగులతో రాణించాడు. సౌథీ 4, బౌల్ట్ 3, జేమిసన్ 2, వాగ్నర్ 1 వికెట్ పడగొట్టారు. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమవగా, ప్రస్తుతం ఓపెనర్లు డేవాన్‌ కాన్వే, టామ్‌ లాథమ్‌ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఇంకా 40కి పైగా ఓవర్ల ఆట ఉండడంతో న్యూజిలాండ్ లక్ష్యాన్ని సాధిస్తుందా లేదా, భారత్ బౌలర్లు సంచలనం సృష్టిస్తారా లేదా ఈ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ డ్రా ముగుస్తుందా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =