సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరిగే అవకాశం?

monsoon parliament session delhi, monsoon session of the parliament, Parliament Monsoon Session, parliament monsoon session 2020, parliament monsoon session 2020 dates, parliament session, parliament session 2020, parliament session 2020 india

కరోనా మహమ్మారి కారణంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను తగ్గించి, లోక్‌సభ, రాజ్యసభలను మార్చి 23 వ తేదీన వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పార్లమెంట్‌ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసినట్టు సమాచారం. మొత్తం 18 రోజుల పాటుగా సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణ కోసం ఉభయసభల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా భౌతిక దూర నిబంధనలు అనుసరించి సభ్యులకు సీట్లు కేటాయించనున్నారు. రాజ్యసభ సభ్యులు సమావేశాల సందర్భంగా చాంబర్స్ మరియు గ్యాలరీలలో కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా భారీ తెరలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జూలై 17 న రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సమావేశమై పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణ, ఏర్పాట్లపై కీలకంగా చర్చించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =